బంగ్లాను పూర్తిగా ఖాళీ చేసిన రాహుల్‌..నేడు అధికారులకు అప్పగింత

22 Apr, 2023 16:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తన అధికారిక నివాసం 12 తుగ్లక్‌ లైన్‌ను పూర్తిగా ఖాళీ చేశారు. ఆయనపై అనర్హత వేటు పడటంతో లోక్‌సభ హౌసింగ్‌ కమిటీ ఏప్రిల్‌ 22 నాటికి బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్‌ అతని సోదరి ప్రియాంగ గాంధీ గడుపు ముగిసే చివరి రోజైన శనివారం సెంట్రల్‌ ఢిల్లీలోని తన అధికారిక నివాసాన్ని రెండుసార్లు సందర్శించారు. వాస్తవానికి రాహుల్‌ ఢిల్లీ ప్రభుత్వ బంగ్లాలో 2005 నుంచి దశాబ్దాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నారు.  నిజానికి ఏప్రిల్ 14న రాహుల్ గాంధీ తన కార్యాలయంలోని కొన్ని వ్యక్తిగత వస్తువులను బంగ్లా నుంచి తీసుకెళ్లిపోయారు.

శుక్రవారం సాయంత్రం బంగ్లాలో మిగిలిపోయిన వస్తువులను రాహుల్ గాంధీ తీసుకెళ్లినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈమేరకు ఆయన ఈ రోజు(శనివారం) మధ్యాహ్నం 3 గంటలకు బంగ్లా కీలను లోక్‌సభ సెక్రటేరియట్‌కు నివాసం తాళాలు సమాచారం. ఇదిలా ఉండగా, పరువు నష్టం కేసులో రెండేళ్లు జైలు శిక్ష పడటంతో రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌ సభ్యుత్వం గత నెలలోనే ముగిసింది. ఆ తర్వాతే ఆయనకు బంగ్లా ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు వచ్చాయి. అదీగాక ప్రోటోకాల్‌ ప్రకారం రాహుల్‌ బయటకు వెళ్లాల్సిందే. ఈ నేపథ్యంలోనే రాహుల్‌ అనివార్య పరిస్థితుల్లో బంగ్లా ఖాళీ చేయాల్సి వచ్చింది.

ఐతే కేంద్రం రాజకీయ కక్ష సాధిస్తుందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తోంది. వాస్తవానికి పరువు నష్టం కేసులో రాహుల్‌కి గుజరాత్‌ కోర్టు తిరిగి అప్పీలు దాఖలు చేయడానికి 30 రోజులు గడువు ఇచ్చింది. ఈ నిమిత్తం శుక్రవారం కోర్టును ఆశ్రయించినా..రాహుల్‌కి ఊరట లభించలేదు. దీంతో ఆయన తన ఎంపీ అభ్యర్ధిత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఐతే బీజేపీ సూరత్‌ సెషన్స్‌ కోర్టు తీర్పుని గాంధీ కుటుంబాని చెంపదెబ్బగా అభివర్ణించింది. చట్టం అందరికీ సమానమని ఎవరికీ ప్రాధాన్యత ఉండదని కోర్టు నిరూపించిందని పేర్కొంది. దీంతో రాహుల్‌ సూరత్‌ కోర్టు తీర్పను వ్యతిరేకిస్తూ..గుజరాత్‌ హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. 

(చదవండి: ర్నాటక: డీకే శివకుమార్‌ ప్ర‌యాణించిన ఛాపర్‌లో ఈసీ అధికారుల తనిఖీలు )

మరిన్ని వార్తలు