పాశ్వాన్‌కు కన్నీటి వీడ్కోలు

11 Oct, 2020 04:52 IST|Sakshi
పాశ్వాన్‌ భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్న ఆయన కుమారుడు చిరాగ్, పాశ్వాన్‌ భార్య

పట్నా: లోక్‌జనశక్తి పార్టీ(ఎల్జేపీ) నాయకుడు, కేంద్ర మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ అంత్యక్రియలు శనివారం బిహార్‌ రాజధాని పట్నాలో ముగిశాయి. పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న జనార్దన్‌ ఘాట్‌లో అధికారిక లాంఛనాలతో పాశ్వాన్‌ అంత్య క్రియలు నిర్వహించారు. పాశ్వాన్‌ చితికి ఆయన కుమారుడు, ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్‌ నిప్పంటించారు. బిహార్‌ సీఎం నితీశ్, కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్, అధిక సంఖ్యలో పాశ్వాన్‌ అభిమానులు తరలివచ్చారు. పాశ్వాన్‌ స్వస్థలం హాజీపూర్‌ నుంచి జనం అధిక సంఖ్యలో హాజరయ్యారు. చితికి నిప్పపెట్టాక చిరాగ్‌ తీవ్ర భావోద్వేగానికి గురై కుప్పకూ లిపోయాడు. కొంతసేపు అచేతన స్థితికి చేరుకున్నాడు. చిరాగ్‌కు ఎలాంటి ప్రమాదం లేదని సమీప బంధువులు తెలిపారు.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు