వామ్మో.. భారతీయులు ప్రయాణాలపై నెలకు ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసా!

22 Feb, 2023 13:14 IST|Sakshi

ప్రజలు తీరిక సమయాల్లో విహారయాత్రకు ప్లాన్‌ చేసుకుని పర్యాటక ప్రాంతాలలో తిరుగుతూ ఉంటారు. తమకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్లి చిల్‌ అవుతూ అందులో ఉన్న మజాని ఆ​శ్వాదిస్తూ ఉంటారు. ఈ క్రమంలో మనదేశంలో ఉన్న పర్యాటక ప్రాంతాలతో పాటు విదేశాలలో కూడా చుట్టేసి వస్తుంటారు. ఇలా విదేశీ ట్రిప్‌ల కోసం భారతీయులు ప్రతి నెలా దాదాపు 1 బిలియన్ డాలర్లను ఖర్చు పెడుతున్నారు. ఈ ఖర్చు కోవిడ్‌కు ముందు ఉన్న స్థాయిల కంటే చాలా ఎక్కువ అని రిజర్వ్ బ్యాంక్ విదేశీ చెల్లింపులపై డేటా వెల్లడించింది.

2022-23 ఏప్రిల్-డిసెంబర్ కాలంలో ప్రయాణాల కోసం లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS) ద్వారా భారతీయులు జరిపిన చెల్లింపులు 9.95 బిలియన్‌ డాలర్లుగా ఉంది. RBI డేటా ప్రకారం, 2021-22లో ప్రయాణానికి సంబంధించిన ఖర్చు 4.16 బిలియన్‌ డాలర్లు కాగా,  2019-20కి ముందు కోవిడ్ సంవత్సరంలో 5.4 బిలియన్‌ డాలర్లుగా ఉంది. భారతీయులు తమ కుటుంబాలు లేదా స్నేహితులతో కలిసి ప్రపంచవ్యాప్తంగా ట్రిప్‌లకు వెళ్తుంటారు.

వియత్నాం, థాయిలాండ్, యూరప్, బాలి భారతీయులు ఇష్టపడే కొన్ని ప్రధాన గమ్యస్థానాలుగా చెప్పచ్చు. యూరప్, ఇండోనేషియా, వియత్నాం, థాయిలాండ్, దుబాయ్ కూడా ఆ జాబితాలో ఉన్నాయి. సరసమైన ప్రయాణాల పెరుగుదల, సాంకేతిక పురోగతితో, ట్రావెల్ పరిశ్రమ అంతర్జాతీయ గమ్యస్థానాలలో భారీగా వృద్ధి వైపు పరుగెడుతోంది. ముఖ్యంగా ఇప్పుడే ప్రయాణం చేసి తరువాత చెల్లించండి అనే విధానం టూరిస్టులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.


ఇదిలా ఉండగా, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి విదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్ రేటును ప్రస్తుత 5 శాతం నుంచి 20 శాతానికి పెంచాలని కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన భారతీయుల విదేశీ ప్రయాణాలపై ప్రభావం చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్‌బీఐ డేటా ప్రకారం, ప్రధానంగా కోవిడ్-19 వ్యాప్తి తరువాత పరిమితుల కారణంగా 2020-21లో బయటి ప్రయాణాలపై ఖర్చు 3.23 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. 2019-20, 2018-19లో ప్రయాణానికి సంబంధించిన బాహ్య చెల్లింపులు వరుసగా 6.95 బిలియన్‌ డాలర్లు, 4.8 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

చదవండి   పెళ్లైన రెండో రోజే విగతజీవులైన నవ దంపతులు.. రిసెప్షన్‌కు ముందే..

మరిన్ని వార్తలు