Sidhu Moose Wala Murder Case: కాల్చిన చంపిన నలుగురు నిందితుల గుర్తింపు!

7 Jun, 2022 17:20 IST|Sakshi

ఛండీగఢ్‌: పంజాబీ సింగర్‌ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న ఎనిమిది మందిని అరెస్ట్‌ చేసినట్లు మంగళవారం పంజాబ్‌ పోలీసులు వెల్లడించారు. అంతేకాదు.. హత్యలో పాల్గొన్న నలుగురు షూటర్లను గుర్తించినట్లు తెలిపారు.  

హత్య కుట్రకు సహకరణ, రెక్కీ నిర్వహణ, షూటర్లకు ఆశ్రయం కల్పించారనే నేరారోపణలపై ఈ ఎనిమిది మందిని పంజాబ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇందులో సిద్ధూతో ఘటనకు ముందు సెల్ఫీ తీసుకున్న వ్యక్తి కూడా ఉన్నాడు. అంతేకాదు.. ఈ హత్యలో పాల్గొన్న నలుగురు షూటర్లను గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతం వీళ్ల కోసం వేట కొనసాగుతోందని ప్రకటించారు పోలీసులు.
  
అరెస్టయిన వాళ్లను.. సందీప్‌ సింగ్‌ అలియాస్‌ కేక్డా(సిస్రా), మన్‌ప్రీత్‌ సింగ్‌ అలియాస్‌ మన్నా(బతింద), మన్‌ప్రీత్‌ బావు(ఫరీద్‌కోట్‌), ఇంకా అమృత్‌సర్‌తో పాటు హర్యానాకు చెందిన ప్రాంతాల నుంచి నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే హత్యలో పాల్గొన్న షూటర్ల వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.  

మే 29వ తేదీన.. పంజాబీ ప్రముఖ సింగర్‌ సిద్ధూ మూసేవాలా దారుణంగా కాల్పుల ఘటనలో హత్యకు గురైన సంగతి తెలిసిందే.

చదవండి: సిద్ధూ అలా చేసి ఉంటే ప్రాణాలతో ఉండేవాడేమో!

మరిన్ని వార్తలు