స్పైడర్‌ మాన్‌ ‘బల్లి’..! సోషల్‌ మీడియాలో ఫోటో వైరల్‌

23 Dec, 2021 23:35 IST|Sakshi

Spider Man lizard: స్పైడర్‌ మాన్‌ సీరిస్‌లో భాగంగా తాజాగా ‘స్పైడర్‌ మాన్‌: నో వే హోమ్‌’ చిత్రం ఈ నెల 16న ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా అచ్చంగా స్పైడర్‌ మాన్‌ను పోలినట్లు ఉన్న ఒక జాతి బల్లి ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే సాధారంగా గోదుమ రంగులో ఉండే బల్లి మనకు ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ బల్లి మాత్రం అందుకు భిన్నం నీలం, ఎరుపు రంగులో ఉండి ఆకర్షిస్తోంది. ఈ బల్లి ఫోటోను ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌(ఐఎఫ్‌ఎస్‌) ఆఫీసర్‌ సుశాంత నంద డిసెంబర్‌ 21న తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

అదేవిధంగా ‘రియల్‌ లైఫ్‌ స్పైడర్‌ మాన్‌’ అని కామెంట్‌ కూడా జతచేశారు. స్పైడర్‌ మాన్‌గా కనిపిస్తున్న బల్లి ఎక్కువగా టాంజానియా, రువాండా, కెన్యా దేశాల్లో కనిపిస్తుంది. అయితే ఈ జాతి మగ బల్లి తల, భుజాలు ఎరుపు రంగులో ఉండగా.. మిగతా శరీరం నీలం రంగులో ఉంటుంది. బల్లి ఫోటోను చూసిన నెటిజన్లు.. తమ అభిమాన సూపర్‌ హీరోతో పోలికలు ఉన్నాయంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ బల్లి అచ్చం స్పైడర్‌ మాన్‌లా ఫోజు పెట్టింది’.. ‘ఎట్టకేలకు స్పైడర్ మాన్ ఫ్యాషన్ డిజైనర్‌ను పొందాను’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు