తమిళనాడులో సంపూర్ణ లాక్‌డౌన్‌: మే 10 నుంచి 24 వరకు

8 May, 2021 10:36 IST|Sakshi

సాక్షి, చెన్నై: దేశవ్యాప్తంగా సెకండ్‌ వేవ్‌ కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజురోజుకు కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా కట్టడిలో భాగంగా పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌, రాత్రి కర్ఫ్యూ విధిందిచిన విషయం తెలిసిందే. తాజాగా తమిళనాడు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నట్లు ప్రకటించింది. ఈ లాక్‌డౌన్‌ ఎల్లుండి( సోమవారం) నుంచి అమల్లో ఉంటుందని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల మే 10 నుంచి 2వారాలపాటు లాక్‌డౌన్ కొనసాగనుంది. శుక్రవారం సీఎం స్టాలిన్‌ కలెక్టర్లతో కరోనాపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదవటంతో  ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ నెల 10న ఉయదం 4 గంటల నుంచి మే 24 తేది ఉదయం 4 గంటల వరకు తమిళానాడులో పూర్తి లాక్‌డౌన్‌ కొనసాగనుంది. మధ్యాహ్నం 12వరకు అత్యవసర సేవలకు అనుమతి ఉంటుందని​ ప్రభుత్వం పేర్కొంది. లాక్‌డౌన్‌లో బ్యాంకులు (50 శాతం సిబ్బందితో), రేషన్ షాపులకు అనుమతి ఉన్నట్లు తెలిపింది. రెస్టారెంట్లలో పార్సిల్‌ సౌకర్యం ఉంటుందని.. క్యాబ్‌లు, ఆటో సేవలు కేవలం ఆస్పత్రి, వివాహ, అంత్యక్రియకు మాత్రమే అనుమతిస్తున్నట్లు  లాక్‌డౌన్‌ ఉత్తర్వుల్లో పేర్కొంది.  


చదవండి: కరోనా నుంచి కోలుకున్నారా? ఇక వీటిని పాడేయాల్సిందే!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు