కలకలం రేపిన శిశువు మృతదేహం

6 Apr, 2022 08:23 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తిరువళ్లూరు(చెన్నై): ఓ ప్రైవేటు వైద్యశాల ఆవరణలో ఆడశిశువు మృతదేహం మంగళవారం కలకలం రేపింది. వివరాలు.. చోళవరం అత్తిపట్టులో ఎంఎంఆర్వీ వైద్యశాల ఉంది. ఇక్కడ సాధారణ, అత్యవసర సేవలకు చిక్సిత అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు వైద్యశాల ఆవరణలోని ఓ మరుగుదొడ్డి వద్ద ఆడశిశువు మృతదేహం ఉన్నట్టు గుర్తించిన సిబ్బంది చోళవరం పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని శిశువును పరిశీలించారు. అయితే అప్పటికే శిశువు మృతి చెందినట్టు గుర్తించి చెన్నై వైద్యశాలకు తరలించారు. కాగా నవజాత శిశువును మరుగుదొడ్డికి సమీపంలో పడేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

మరో ఘటనలో..

కూలిన విద్యుత్‌ స్తంభం 
తిరుత్తణి: తిరుత్తణి శివారులోని కాశినాధ పురం దళితవాడలో హై ఓల్టేజీ విద్యుత్‌ స్తంభంపై పక్కనే ఉన్న చెట్టు కొమ్మలు పడి విద్యుత్‌స్తంభం కూలింది.  అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఘటనతో ఇళ్ల ముందు ఉన్న వారు పరుగులు తీశారు. వెంటనే విద్యుత్‌ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు  విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. విద్యుత్‌ స్తంభం కూలిన సమయంలో వీధిలో ప్రజలు లేకపోవడంతో పెద్దప్రమాదం తప్పింది. అనంతరం కూలిన విద్యుత్‌ స్తంభం తొలగించి కొత్తది ఏర్పాటు చేశారు.  కాగా పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు దుస్థితికి చేరుకున్నాయని స్థానికులు ఆరోపించారు. 

చదవండి: తల్లీ,బిడ్డల హత్య కేసు.. మాజీ ఎమ్మెల్యేకి యావజ్జీవ కారాగార శిక్ష

మరిన్ని వార్తలు