ఏపీలో 3 కొత్త మెడికల్ కాలేజీలకు ఆమోదం

14 Dec, 2021 16:26 IST|Sakshi

రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో మూడు కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భారతి పవార్‌ తెలిపారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 13 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఉన్నాయని చెప్పారు.

ఞ​ప్రధానమంత్రి స్వస్థ్య సురక్ష యోజన కింద తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, విజయవాడలోని సిద్ధార్ధ మెడికల్‌ కాలేజీ, అనంతపురంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను అభివృద్ధికి కూడా ఆమోదం తెలిపినట్లు మంత్రి చెప్పారు. ఇవి కాకుండా పిడుగురాళ్ళ, పాడేరు, మచిలీపట్నంలో కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు.

చదవండి: (CM YS Jagan: సీఎం వైఎస్‌ జగన్‌ నూతన ఏడాది కానుక)

విశాఖ పోర్టులో 1,112 పోస్టులు ఖాళీ
న్యూఢిల్లీ: విశాఖపట్నం పోర్టులో మొత్తం సిబ్బంది సంఖ్య 4,003 ఉండగా 1,112 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పోర్టుల శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్‌ వెల్లడించారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ విశాఖపట్నం పోర్టుతోపాటు దేశంలోని మేజర్‌ పోర్టులలో అనేక ఏళ్ళుగా టెక్నాలజీ, మెకనైజేషన్‌ కారణంగా చోటు చేసుకున్న మార్పుల కారణంగా ప్రైవేట్‌ పోర్టులతో పోల్చుకుంటే మేజర్ పోర్టులలో సిబ్బంది సంఖ్య అవసరమైన దానికంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు మంత్రి చెప్పారు. అందువలన మేజర్‌ పోర్టులలో సిబ్బందిని అవసరం మేరకు మాత్రమే ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు