కారులో జోర్దార్‌గా ఖాకీల చిందులు.. వైరల్‌ కావడంతో దిల్‌ఖుష్‌! ఆపైనే అసలు ట్విస్ట్‌

20 Jan, 2022 21:10 IST|Sakshi

పనిచేసే ప్రదేశాల్లో డ్యాన్స్‌ చేసి పలువురు అధికారులు ఉద్యోగాల నుంచి సస్పెండ్‌ అయిన ఘటనలు చాలానే చూశాం. అయితే కదులుతున్న కారులో సరదాగా డ్యాన్స్‌ చేసిన ముగ్గురు పోలీసులు వైరల్‌ అయ్యారు. ఆ వీడియోతో సెలబ్రిటీలు అయ్యారు. అంతా హ్యాపీ అనుకున్న టైంలో ఊహించని ట్విస్ట్‌ వచ్చి పడింది.

ఆ ముగ్గురు పోలీసులు సస్పెండ్‌ అయ్యారు. కారులో డ్యాన్స్‌ చేస్తే.. సస్పెండ్‌ ఎలా అవుతారని అనుకుంటున్నారా?. అయితే గుజరాత్‌లోని కచ్‌ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన గురించి చదివి తెలుసుకోవాల్సిందే. ముగ్గురు పోలీసులు కారులో ప్రయాణం చేస్తూ.. సరదాగా డ్యాన్స్‌ చేశారు. డ్యాన్స్‌ చేస్తున్న సమయంలో ముఖానికి మాస్క్‌ ధరించలేదు. సీటు బెల్ట్‌ కూడా పెట్టుకోకుండా ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘించారు.

డ్యాన్స్‌ ఏమో వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో కాస్త పోలీసు ఉన్నతాధికారుల వరకు చేరింది. పోలీసులు డ్రెస్‌లో ఉండి.. అది డ్యూటీలో డ్యాన్స్‌ చేయడమే కాకుండా కరోనా, ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించినందుకు ముగ్గురు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేసినట్లు ప్రకటించారు.

మరిన్ని వార్తలు