తప్పు చేశాను క్షమించండంటూ స్టేజీ మీదే..

4 Mar, 2021 17:20 IST|Sakshi
స్టేజీ మీద గుంజీళ్లు తీస్తోన్న టీఎంసీ నాయకుడు సుశాంత్‌ పాల్‌

స్టేజీపై గుంజీళ్లు తీసిన టీఎంసీ నాయకుడు 

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో పాగా వేయాలని బీజేపీ.. మరో సారి అధికారంలోకి రావాలని టీఎంసీ సీరియస్‌గా ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంలో పాగా వేయడం కోసం బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ పేరిట టీఎంసీ నాయకులను లాక్కుంటుంది. తాజాగా తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయుకుడు ఒకరు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన ఇన్నాళ్లు టీఎంసీలో ఉండి తప్పు చేశాను.. ఇందుకు తనను క్షమించాల్సిందిగా కోరుతూ.. వేదిక మీద గుంజీళ్లు తీశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..

సుశాంత్‌ పాల్‌ అనే నాయకుడు కొద్ది రోజుల క్రితం టీఎంసీ నుంచి బయటకు వచ్చాడు. నేడు ఆయన బీజేపీలో చేరారు. టీఎంసీ మాజీ మినిస్టర్‌ సువేందు అధికారి, రాష్ట్ర బీజేపీ నాయకుల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పాల్‌ మాట్లాడుతూ.. ‘‘మొదట నేను బీజేపీలోనే ఉన్నాను. కానీ లెఫ్ట్‌ ప్రభుత్వాన్ని ఓడించడం కోసం 2005లో టీఎంసీలో చేరాను. అప్పటి నుంచి ఆ పార్టీలో ఉండి తప్పు చేశాను. టీఎంసీ కార్యకర్తగా నాకు అంటుకున్న పాపాల ప్రక్షాళన కోసం నాకు నేనే ఓ చిన్న శిక్ష వేసుకుంటున్నాను’’ అంటూ మూడు సార్లు గుంజీళ్లు తీశారు. పక్కన ఉన్న వారు ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ పాల్‌ మాత్రం ఆగలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.

 

చదవండి:

టీఎంసీ కంచుకోటలో పాగాకు బీజేపీ వ్యూహాలు
బీజేపీ, టీఎంసీలను ఓడించాలి

మరిన్ని వార్తలు