Evening News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

29 Jun, 2022 17:00 IST|Sakshi

1.. YSRCP Plenary 2022: కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు
చిలీపట్నంలో బుధవారం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశంలో మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. మచిలీపట్నంలో పేర్ని నాని నిలబడినా.. ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి నిలబడినా అండగా నిలబడాలని కోరారు. బందరులో వారసుడినే గెలిపించాలని, ఇల్లరికం అల్లుడిని (టీడీపీ కొల్లు రవీంద్ర) కాదని అన్నారు.
పూర్తికథనం కోసం క్లిక్‌ చేయండి  

2.. బీజేపీలోకి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. నడ్డా సమక్షంలో చేరిక!
చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలోకి చేరబోతున్నట్లు సమాచారం. జులై 1వ తేదీన ఆయన, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో అధికారికంగా పార్టీలో చేరతారని తెలుస్తోంది. 
పూర్తికథనం కోసం క్లిక్‌ చేయండి 

3.. Maharashtra Political Crisis: ఇంతకు ఎవరి శిబిరంలో ఎంతమంది ఎమ్మెల్యేలు? 
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం రోజురోజుకూ ముదరడంతో ఎవరి శిబిరంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారనేది ఇంతవరకు ఒక స్పష్టత రాలేదు. దీంతో ఎవరి శిబిరంలో ఎంతమంది ఎమ్మెల్యేలున్నారో అంతుచిక్కడం లేదు. ఎవరికి వారే బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారే తప్ప కచ్చితమైన ఎమ్మెల్యేల సంఖ్య ఎవరూ బయటపెట్టడం లేదు.
పూర్తికథనం కోసం క్లిక్‌ చేయండి 

4.. మహారాష్ట్ర గవర్నర్‌ రఫెల్‌ కంటే వేగంగా వ్యవహరించారు: సంజయ్‌ రౌత్‌ సెటైర్లు
మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్ట్‌లమీద ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా గవర్నర్‌ ఆదేశాలపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ స్పందించారు. మహారాష్ట్ర గవర్నర్ గురువారం బలపరీక్షకు ఆదేశించడాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా రౌత్‌ అభివర్ణించారు. గవర్నర్‌ జెట్‌ స్పీడ్‌ కంటే వేగంగా వ్యవహరించారని సెటైర్లు వేశారు. రాఫెల్‌ జెట్‌ కూడా ఇంత వేగంగా ఉండదని అన్నారు.
పూర్తికథనం కోసం క్లిక్‌ చేయండి 

5.. Boris Johnson: పుతిన్‌ ఆ పుట్టుక పుట్టి ఉంటేనా..! పరిస్థితి మరోలా ఉండేది
ఉ‍క్రెయిన్‌ యుద్ధంతో వేలమంది అమాయకుల ప్రాణాలు బలిగొంటున్నాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌. పాశ్చాత్య దేశాల ఆంక్షలను లెక్కచేయకుండా రష్యన్‌ బలగాలతో నరమేధం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో.. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, పుతిన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
పూర్తికథనం కోసం క్లిక్‌ చేయండి 

6.. IND VS IRE 2nd T20: రికార్డు విజయంతో పాటు చెత్త రికార్డునూ మూటగట్టుకున్న హార్ధిక్‌ సేన
ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో హార్ధిక్‌ పాండ్యా నేతృత్వంలోని యువ భారత జట్టు రికార్డు విజయాన్నినమోదు చేసి రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన విషయం తెలిసిందే. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో ఆతిధ్య ఐర్లాండ్‌ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించిన భారత్‌.. రికార్డు విజయాన్ని నమోదు చేయడంతో పాటు ఓ చెత్త రికార్డును కూడా మూటగట్టుకుంది. 
పూర్తికథనం కోసం క్లిక్‌ చేయండి 

7.. జీతం రూ.50 వేలు.. అకౌంట్‌లో పడింది రూ.1.42 కోట్లు !.. ఆ తర్వాత..
జీతాలు చెల్లించే విషయంలో కంపెనీలు జాగ్రత్తగా వ్యవహరించకుంటే ఇక్కట్లు‍్లు తప్పవు అనేందుకు తాజాగా ఉదాహారణ మరొకటి వెలుగులోకి వచ్చింది. శ్రమ దోపిడి లేకుండా పనికి తగ్గ జీతం ఇవ్వడం ఎంత ముఖ్యమో.. నిర్లక్ష్యంగా అధిక మొత్తంలో చెల్లించడమూ కంపెనీలకు ప్రమాదమే. కావాలంటే చిలీ ఏం జరిగిందో మీరే ఓసారి చూడండి.
పూర్తికథనం కోసం క్లిక్‌ చేయండి  

8.. Hema Chandra- Sravana Bhargavi: విడాకుల వార్తలపై హేమచంద్ర, శ్రావణ భార్గవి ఏమన్నారంటే?
టాలీవుడ్‌ స్టార్‌ సింగర్స్‌ హేమచంద్ర- శ్రావణ భార్గవి విడాకుల వార్త గత కొంతకాలంగా సోషల్‌ మీడియాను ఊపేస్తున్న విషయం తెలిసిందే! కొన్నినెలల నుంచి వీరికి మాటల్లేవని, త్వరలోనే వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు తెగ వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఈ రూమర్స్‌పై హేమచంద్ర దంపతులు స్పందించారు.
పూర్తికథనం కోసం క్లిక్‌ చేయండి  

9.. ఉదయ్‌పూర్‌ ఘటనను ఖండించిన దీదీ.. నూపుర్‌కు పరోక్ష హెచ్చరికలు
కోల్‌కతా: ఉదయ్‌పూర్‌ టైలర్‌ కన్హయ్య లాల్‌ హత్యోదంతంపై టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. హింస, ఉగ్ర వాదం ఎంతైనా ఆమోదయోగ్యం కాదు! ఉదయ్‌పూర్‌లో జరిగిన దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. చట్టం తన పని చేసుకుని పోతుంది. కాబట్టి, శాంతిని కాపాడాలంటూ ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను అని ట్వీట్‌ ద్వారా విజ్ఞప్తి చేశారామె.
పూర్తికథనం కోసం క్లిక్‌ చేయండి 

10.. Family Planning: స్త్రీలే కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకోవాలా?
పిల్లలు పుట్టని ఆపరేషన్‌ అనగానే మన దేశంలో గుర్తొచ్చేది స్త్రీలే. మొదటి కాన్పులోనో రెండో కాన్పులోనో ఆపరేషన్‌ ప్లాన్‌ చేసే భర్తలు ఉంటారు భార్యకు. ‘మీరు చేయించుకోండ’ని భార్య అనలేని పరిస్థితి ఇంకా దేశంలో ఉంది. ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’ (2019–2021) నివేదిక ప్రకారం వందమంది వివాహితలలో 38 మంది ఆపరేషన్‌ చేయించుకుంటున్నారు.
పూర్తికథనం కోసం క్లిక్‌ చేయండి  

మరిన్ని వార్తలు