వైరల్‌: వధువు నోరు, ముక్కు నుంచి పొగ!

18 Jun, 2021 14:21 IST|Sakshi

రింగులు రింగులుగా పొగ వదిలిని పెళ్లి కుమార్తె

గత కొద్ది కాలంగా సోషల్‌ మీడియాలో ఎక్కువగా పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోలే ట్రెండ్‌ అవుతున్నాయి. కావాలని చేస్తున్నారో.. లేక నిజంగానే జరుగుతున్నాయో తెలియదు కానీ పెళ్లి మంటపం వేదికగా పలు విచిత్ర, విభిన్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఇలాంటి వీడియో మరొకటి సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. దీనిలో పెళ్లి కుమార్తె ఏకంగా వరుడు, బంధువుల సమక్షంలో కెమరా ముందు రింగులు రింగులుగా పొగ వదులుతూ కనిపించింది. ఈ సీన్‌ చూసిన వారు వెంటనే ఛీ సిగ్గు లేదు.. సిగరెట్‌ తాగుతున్నావా అని తిడదామనుకుంటారు. కానీ తర్వాత కనిపించే దృష్యంతో అసలు విషయం తెలుస్తుంది. 

సర్వర్‌ పొగలు కక్కే ఆహారా పదార్థాన్ని ఒకదాన్ని ఆమె నోటికి అందిస్తాడు. దాన్ని తిన్న వధువు ఇలా నోరు, ముక్కు నుంచి రింగులురింగులుగా పొగ వదులుతుంది. సడెన్‌గా చూసిన వారికి స్మోకింగ్‌ చేస్తుందా ఏంటి అనిపిస్తుంది. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనే వివరాలు లేవు కానీ.. ఈ వీడియో చూసిన వారంతా యాంకర్‌ సుమను గుర్తు చేసుకుంటున్నారు. గతంలో సుమ కూడా ఇలానే ఐస్‌క్రీం తిని నోరు, ముక్కులోనుంచి పొగలు వదిలి అందరిని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే.

చదవండి: అతడికి 23, ఆమెకు 60.. ‘‘నానమ్మలాంటి ఆమెతో లవ్వేంటిరా బాబు’’!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు