గర్ల్‌ఫ్రెండ్‌ పెళ్లి ఆపేందుకు ప్రియుడి ప్లాన్‌.. సీఎంకు ట్వీట్‌

21 May, 2021 13:11 IST|Sakshi

అడ్డూ అదుపు లేకుండా విస్తరిస్తున్న కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి అన్ని రాష్ట్రాలు కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ వంటి చర్యలు చేపట్టి కరోనా కోరలు వంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ విపత్కర పరిస్థితుల్లోనూ పలు ప్రభుత్వాలు పెళ్లిళ్లకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. తక్కువ మందితోనే ఈ పెళ్లి వేడుక నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ  నేపథ్యంలోనే ఇటీవల బిహార్‌ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 25 వరకు పొడిగించింది. ఈ సందర్భంగా సీఎం నితీష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తికి వేడుకలు అడ్డాగా మారుతున్నాయని, కాబట్టి వీలైతే పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాలని కోరారు.

ఈ క్రమంలో ఇదే మంచి సమయం అని భావించిన ఓ వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌ పెళ్లి ఆపాలని నిర్ణయించుకున్నాడు. దీంతో కోవిడ్‌ కాలంలో వివాహాలను వాయిదా వేయాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను కోరాడు. ‘సార్‌, మీరు వివాహాలపై నిషేధం విధించగలిగితే, మే 19న జరగాల్సిన నా ప్రియురాలి వివాహం కూడా నిలిచిపోతుంది. ఇదే కనక జరిగితే నేను ఎప్పటికీ మీకు కృతజ్ఞుడను’ అని సీఎంను ట్యాగ్‌ చేసి ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ‘ప్రేమ జీవితంలో ఓ భాగమే కానీ అదే జీవితం కాదని.. వివాహం ఆగిపోతే ఆ తర్వాత మీరు ఆమెను పెళ్లి చేసుకుంటారా?’ అని ప్రశ్నిస్తున్నారు.

చదవండి: 
కరోనా కాలం: మరీ 70 వేల రూపాయలా?!
కరోనా: తెల్లారితే కూతురు పెళ్లి.. అంతలోనే తండ్రి

>
మరిన్ని వార్తలు