Viral Video: చెస్‌ బోర్డు మాదిరి బ్రిడ్జ్‌... ఎక్కడుందో తెలుసా!

16 Jul, 2022 19:44 IST|Sakshi

చెన్నై: 44వ ఫిడే చెస్ ఒలింపియాడ్ జూలై 28న చెన్నైలోని మహాబలిపురంలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా చెన్నై నగరంలోని నేపియర్‌ బ్రిడ్జ్‌కి చెస్‌ బోర్డులా పేయింట్‌ వేశారు. ఈ బ్రిడ్జ్‌ ప్రయాణికులను అత్యద్భుతంగా ఆకట్టుకుంటోంది. వందేళ్ల చెస్‌ ఒలింపియాడ్‌ చరిత్రలో తొలిసారిగా భారత్‌ ఆతిథ్యమివ్వనుంది.

ఈ ఏడాది ఈ ఒలింపియాడ్‌ ఈవెంట్‌కి సుమారు 2 వేల మంది దాక క్రీడాకారులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ మేరకు ఐఏఎస్‌ అధికారిణి సుప్రియా సాహు ఈ బ్రిడ్జ్‌ తాలుకా వీడియోని పోస్ట్‌ చేస్తూ...భారతదేశానికి చెందిన చెస్‌ రాజధాని చెన్నై గగ్రాండ్‌ చెస్‌ ఒలింపియాడ్‌ 2022కి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, ఐకానిక్‌ నేపియర్‌ బ్రిడ్జ్‌గా చెస్‌ బోర్డులా అలంకరిచండబడిందని ట్వీట్‌ చేశారు. దీంతో నెటిజన్లు వావ్‌ వాటే స్పీరిట్‌ నమ్మా చెన్నై అంటూ ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు.

(చదవండి: కరోనాతో ఆస్పత్రిలో చేరిన పన్నీర్‌సెల్వం)

మరిన్ని వార్తలు