ఏం తెలివిరా నాయనా! ఏకంగా రూ. 64 లక్షలు..

29 Jan, 2023 20:23 IST|Sakshi

విమానాశ్రయంలో తరుచుగా అక్రమంగా బంగారం, జంతువులు, డబ్బులు తరలిస్తున్న ఘటనలు గురించి విని ఉన్నాం. అదీకూడా వాళ్లకు ఊహకందని విధంగా భలే విచిత్రమైన రీతిలో తరలించిన ఉదంతాలను చూశాం. వాటన్నింటికి మించి అన్నట్లుగా ఇక్కడొక వ్యక్తి ట్రాలీ బ్యాంగ్‌ హ్యండిల్లో నగదును తరలించాలని చూసి పట్టుబడ్డాడు.

వివరాల్లోకెళ్తే...ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుందర్‌ సింగ్‌ రిహాల్‌ అనే వ్యక్తి చెకింగ్‌ సమయంలో అతని వద్ద సరైన విధంగా డాక్యుమెంట్స్‌ లేకపోవడంతో అతన్ని ఆపారు. ఆ తర్వాత అతన్ని తనిఖీ చేస్తుండగా అతడి తీరు అనుమానాస్పదంగా ఉండటంతో.. అధికారుల కస్టమ్స్‌ అధికారుల వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ స్కాన్‌ చేయగా ట్రాలీ బ్యాగులో ఏదో ఉన్నట్లు చూపించడంతో ఇంకా క్షుణ్ణంగా తనిఖీలు చేయడం ప్రారంభించారు.

ఆ క్రమంలో ట్రాలీ హ్యండిల్‌లో దాచిన విదేశీ కరెన్సీని నెమ్మదిగా బయటకు తీశారు. ఏకంగా మొత్తం రూ. 65 లక్షలు తరలించేందకు యత్నించినట్లు అధికారులు వెల్లడించారు. అందులో సుమారు రూ. 60 లక్షలకు సంబంధించి సుమారు 68 వేల యూరోల కరెన్సీ, రూ. 4లక్షలకు సంబంధించిం న్యూజిలాండ్‌కి చెందిన 5 వేల డాలర్లు ఉన్నాయని చెప్పారు.

ఐతే నిందితుడు భారీ మొత్తంలో అంత నగదు తరలించేందుకు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించడంలో విఫలమయ్యాడని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. దీంతో అతని వద్ద నుంచి భారీ మొత్తంలో ఉన్న ఆ నగదును స్వాధీనం చేసుకోవడమే గాక అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వాస్తవానికి ఆ ప్రయాణికుడు  థాయ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ టీహెచ్‌-332లో బ్యాంకాక్‌కు వెళ్లాల్సి ఉంది.

(చదవండి: చారిత్రాత్మక క్లాక్‌ టవర్‌ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాహుల్‌)

మరిన్ని వార్తలు