సైన్యంలో చేరమని మిమ్మల్ని ఎవరు అడిగారు: మాజీ ఆర్మీ చీఫ్ ఫైర్‌

20 Jun, 2022 08:36 IST|Sakshi

అగ్నిపథ్‌పై ఆందోళనలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ స్కీమ్‌పై తగ్గేదేలే అంటూ త్రివిధ దళాధిపతులు క్లారిటీ ఇచ్చిన విషయాన్ని తెలిసిందే. ఇక, తాజాగా కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ అగ్నిపథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారిపై వీకే సింగ్‌ మండిపడ్డారు. వీకే సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. అగ్నిపథ్ స్కీమ్‌ నచ్చకపోతే అభ్యర్థులు.. దానిని ఎంచుకోవద్దని ఘాటుగా స్పందించారు. అగ్నిపథ్ స్కీమ్‌ నచ్చని వారు సాయుధ దళాల్లో చేరవద్దని కోరారు. భారత సైన్యం సైనికులుగా చేరమని బలవంతం చేయదని, సైన్యంలో చేరాలనుకునే వారు తమ ఇష్టానుసారం డెసిషన్‌ తీసుకోవచ్చని తెలిపారు.

‘‘అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్ నచ్చకపోతే, అందులో చేరండి అని మిమ్మల్ని అడుగుతున్నారని ప్రశ్నించారు. అంతేకాకుండా బస్సులు, రైళ్లను తగలబెడుతున్న వారిని సాయుధ దళాల్లోకి తీసుకుంటామని ఎవరు చెప్పారు. మీరు అర్హత ప్రమాణాలను పూర్తి చేస్తేనే మిమ్మల్ని ఎంపిక చేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే 1999 యుద్ధం తర్వాత కార్గిల్ కమిటీని ఏర్పాటు చేసినప్పుడు అగ్నిపథ్‌ గురించి ప్రస్తావన వచ్చిందని ఆయన వెల్లడించారు. 

ఇది కూడా చదవండి: భారత్‌ బంద్‌ ఎఫెక్ట్‌: విద్యా సంస్థలు మూసివేత

మరిన్ని వార్తలు