సమాన మార్క్‌లు కానీ ఆమె టాపర్‌ కాలేదు, ఎందుకు?

17 Oct, 2020 11:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఒడిశాకు చెందిన సోయబ్‌ అఫ్తాబ్‌ నీట్‌-2020 పరీక్షలలో టాపర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అతనికి నీట్‌లో 720 కి 720 మార్క్‌లు వచ్చాయి. అయితే అతనితో సమానంగా ఢిల్లీకి చెందిన ఆకాంక్ష సింగ్‌ కూడా ఫుల్‌ మార్క్‌ తెచ్చుకుంది. ఇద్దరికి సరిసమానమైన మార్క్‌లు వచ్చినప్పటికి సోయబ్‌ టాపర్‌గా నిలవడానికి కొన్ని కారణాలు  ఉన్నాయి. అవి ఏంటంటే నీట్‌ పరీక్షలో ఇద్దరు అభ్యర్థులకు సమానమైన మార్క్‌లు వచ్చినప్పుడు వారికి ర్యాంక్‌ కేటాయించేటప్పుడు అనేక  విషయాలను పరిగణనలోకి  తీసుకుంటారు. మొదటగా పరిశీలించేది వారి బయాలజీ మార్క్‌లు, అక్కడ కూడా ఇద్దరికి సమానమైన మార్క్‌లు వస్తే రసాయన శాస్త్రంలో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూస్తారు. 

 ఆ తరువాత ఎవరికి ఎక్కువ నెగిటివ్‌ మార్క్‌లు వచ్చాయో పోలుస్తారు. అప్పటకి ఇద్దరు సమానంగా ఉంటే వయసును లెక్కిస్తారు. ఈ ఏడాది నీట్‌ టాపర్స్‌ ఇద్దరు అన్నింటిలో సమానంగా మార్క్‌లు తెచ్చకున్నప్పటికి ఆకాంక్ష సింగ్‌ సోయబ్‌ కంటే చిన్నది. అందుకే పెద్ద వాడు అయిన సోయబ్‌నే ఆల్‌ ఇండియా నీట్‌ ర్యాంకర్‌ 1 గా ప్రకటించారు. ఇలా ఇద్దరికి సమానమైన మార్క్‌లు వచ్చినప్పుడు వారి వయసులను పరిశీలించి ఎవరు పెద్దవారైతే వారికే మొదటి ర్యాంక్‌ను కేటాయిస్తారు. ఈ కారణంగానే సోయబ్‌ టాపర్‌గా నిలిచాడు. చదవండి: నీట్‌ ఫలితాల వెల్లడి

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు