మందుబాబులకు షాక్‌.. ఐదు రోజులు వైన్స్‌ బంద్‌.. ఎక్కడంటే?

3 Sep, 2023 16:33 IST|Sakshi

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మందుబాబులకు అలర్ట్‌. ఢిల్లీలో వరుసగా ఐదు రోజుల పాటు వైన్స్‌ షాప్‌లు మూడపడనున్నాయి. కాగా, ఢిల్లీలో జీ20 సమావేశాలు, పండుగల నేపథ్యంలో మద్యం దుకాణాలు బంద్‌ కానున్నాయి. 

వివరాల ప్రకారం.. ఢిల్లీలో వరుసగా ఐదు రోజులపాటు వైన్‌ షాపులు మూతపడనున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి, జీ20 సమావేశాల సందర్భంగా ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీంతో ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు వైన్‌ షాపులను క్లోజ్‌ చేయనున్నారు. ఢిల్లీ వేదికగా సెప్టెంబర్‌ 9, 10 తేదీల్లో జీ20 శిఖరాగ్ర సమావేశాలు జరుగనున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 8 నుంచి 10 వరకు పబ్లిక్‌ హాలిడేగా ప్రకటించింది. ఆ మూడు రోజులు మార్కెట్లు, దుకాణాలు, పాఠశాలలు, బ్యాంకులతోపాటు మద్యం దుకాణాలు కూడా మూతపడనున్నాయి.

మరోవైపు.. శ్రీకృష్ణ జన్మాష్టమి నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఈ నెల 6, 7 తేదీల్లో మద్యం దుకాణాలు బంద్‌ చేయాలని ఆదేశించింది. దీంతో వరుసగా ఐదు రోజులపాటు వైన్‌ షాపులు మూతపడనున్నాయి. ఈ నేపథ్యంలో వరుస సెలవుల కారణంగా మద్యం దుకాణాల వద్ద జనాలు బారులు తీరుతున్నారు. గత వారం రోజులుగా రాజధానిలో మద్యం అమ్మకాలు ఒక్కసారిగా పెరిగిపోవడం విశేషం. 

ఇది కూడా చదవండి: 'పాక్‌కు వెళ్లండి..' విద్యార్థులపై టీచర్ వివాదాస్పద వ్యాఖ్యలు


 

మరిన్ని వార్తలు