నా ప్రియుడు మరీ ఇంత నీచంగా ఆలోచిస్తాడా?

1 May, 2021 12:06 IST|Sakshi

సంబంధ బాంధవ్యాలు చాలా గమ్మత్తైనవి. ముఖ్యంగా రిలేషన్‌లో ఉన్నప్పుడు ఎవర్ని ఎవరు ఇష్టపడుతున్నారో, ద్వేషిస్తున్నారో అర్ధం చేసుకోవడం చాలా కష్టం అని అంటోంది  ఓ యువతి. ప్రేమ స్వర్గపుటంచుల్లో విహరిస్తున్న ఆ యువతికి తన ప్రియుడి నుంచి ఎదురవుతున్న ఇబ్బందుల్ని నెటిజన‍్లతో పంచుకున్నారు. ప్రస్తుతం ఆ యువతి  చేసిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

ఓ యువకుడితో రిలేషన్‌లో ఉన్న సదరు యువతి తన ప్రియుడు లేని సమయంలో బికిని ధరించాలని భావిస్తున్నారు. కానీ అందుకు ఆమె ప్రియుడు ఒప్పు కోవడం లేదు. ఎందుకంటే అతను ఇతర మగాళ్లను అస్సలు నమ్మడు. ఎందుకంటే బికిని ధరించిన అమ్మాయిల్ని తదేకంగా చూస్తానని, తను బికినీ ధరిస్తే కూడా ఇతర మగాళ్లు అలాగే చూస్తారని అనటం తనను ఎంతగానో బాధించిందని పేర్కొన్నారు. 

ఈ విషయంపై అతనితో వాధించానని, తను బికిని ధరించడం ఇష్టం లేకపోతే చెప్పాలని తెలిపానన్నారు. కానీ బికిని ధరించిన అమ్మాయిల్ని అలా ట్రీట్‌ చేయడం మానుకోవాలని హితవు పలికినట్లు చెప్పుకొచ్చారు. బికిని ధరించిన వాళ్లను ఎందుకు అలా ట్రీట్‌ చేస్తున్నావని ప్రశ్నించానని తెలిపారు. తనను బికినిలో చూడకూడదని అతను అనుకోవటం మంచిదే. కానీ ఇతర అమ్మాయిల గురించి అసభ్యంగా అనుకోవద్దని చెబితే తన మాటల్ని కొట్టిపారేస్తున్నాడని ఆమె తన అనుభవాల్ని నెటిజన్లతో షేర్‌ చేసుకున్నారు.  

‘నా ప్రియుడి ఆలోచనను నేను చాలా అగౌరవంగా భావిస్తున్నాను. నా శరీరాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడానికి చాలా కష్టపడుతున్నాను. ఇతరుల అటెన్షన్‌ను పొందడానకి బికిని ధరించడం లేదన్నా అతను నమ్మటంలేదు. పరాయి పురుషుల్ని నమ్మడు. అతను ఇతరుల పట్ల ఆలోచిస్తున్న తీరు చూస్తుంటే నాకు విసుగొస్తుంది. ప్రేమ అనే ముసుగు ధరించిన అతను నాకు రక్షణగా నిలుస్తున్నాడా?. లేదంటే నన్ను వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడా?’ అని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఆమె ప్రియుడి ఆలోచనపై పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

‘అతను మిమ్మల్ని నమ్మడం లేదు. మిమ్మల్ని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతనికి గుడ్‌బై చెప్పడం మంచిది’ అని ఓ నెటిజన్‌ సలహా ఇచ్చాడు. ‘మీరు బికినీ ధరించడాన్ని నియంత్రిస్తున్నాడంటే, వివాహం తర్వాత మీ స్వేచ్ఛను ఎలా హరిస్తాడో ఊహించుకోండి’ అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ‘అతను మిమ్మల్ని నమ్ముతున్నాడా? లేదా అనేది ముఖ్యం కాదు. మీరు ఎలాంటి దుస్తుల్ని ధరించినా, మిమ్మల్ని చూడనివ్వకుండా ఆపలేడు. మిమ్మల్ని అతను ఎలా ట్రీట్‌ చేస్తున్నారనేది మీరే డిసైడ్‌ చేసుకోవాలి’ అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.

చదవండి: 
వైరల్‌: అమ్మాయి టీ-షర్ట్‌పై ఆర్జీవీ కొంటె కామెంట్‌..
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు