మరో అంతర్జాతీయ కంపెనీకి సీఈవోగా భారత సంతతి వ్యక్తి

29 Mar, 2022 10:28 IST|Sakshi

కొరియర్‌ రంగంలో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఫెడ్‌ ఎక్స్‌ సంస్థకి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా భారత సంతతి వ్యక్తి రాజ్‌ సుబ్రమణియన్‌ పదవీ బాధ్యలు చేపట్టనున్నారు. 2022 జూన్‌ 1 నుంచి ఆయన ఈ పదవిలోకి వస్తారని ఫెడ్‌ఎక్స్‌ యాజమాన్యం స్పష్టం చేసింది.
ఫెడ్‌ఎక్స్‌ సంస్థకి ప్రస్తుతం సీఈవోగా ఫ్రెడెరిక్‌ డబ్ల్యూ స్మిత్‌ ఉన్నారు. జూన్‌ 1తో ఆయన పదవీ కాలం ముగియనుంది. దీంతో కొత్త సీఈవో వేటలో ఉన్న ఫెడ్‌ఎక్స్‌ సంస్థ చివరకు రాజ్‌ సుబ్రమణియన్‌ను ఆ స్థానానికి తగిన వ్యక్తిగా ఎంపిక చేసుకుంది. 

ఫ్రెడెరిక్‌ స్మిత్‌ 1971లో ఫెడ్‌ఎక్స్‌ కొరియర్‌ సంస్థను స్థాపించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీలో ఆరు లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇక రాజ్‌సుబ్రమణియన్‌ విషయానికి వస్తే ఫెడ్‌ఎక్స్‌లో 1991లో చేరిన రాజ్‌ సుబ్రమణియన్‌ 2020లో ఫెడ్‌ఎక్స్‌ బోర్డు సభ్యుడిగా ఆయన ఎంపికయ్యారు. రెండేళ్లు అక్కడ పని చేసిన తర్వాత ఏకంగా సీఈవో స్థానానికి చేరుకున్నారు. 

ఫెడ్‌ఎక్స్‌ సీఈవో పోస్టుకు రాజ్‌ సుబ్రమణియన్‌ తగిన వ్యక్తని. ఆయన సారధ్యంలో ఫెడ్‌ఎక్స్‌ మరిన్న ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందనే నమ్మకం ఉందని ఫెడ్‌ఎక్స్‌ గవర్నింగ్‌ బోర్డు చైర్మన్‌ డేవిడ్‌ స్టైనర్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఫ్రెడెరిక్‌ స్మిత్‌ ఎంతో ముందు చూపుతో స్థాపించిన ఫెడ్‌ఎక్స్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని రాజ్‌ సుబ్రమణియన్‌ తెలిపారు.

చదవండి: ఆస్కార్‌ అవార్డ్‌ వేడుకలో తళుక్కున మెరిసిన ఇండియన్‌ ఇంజనీర్‌..!

మరిన్ని వార్తలు