'తెలంగాణ దళిత బంధు' పథకంపై ఎన్నారైల హర్షం

19 Jul, 2021 20:11 IST|Sakshi

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 'దళిత సాధికారత' పథకానికి సీఎం కేసీఆర్ 'దళిత బంధు' అని నామకరణం చేసిన విషయం తెలిసిందేనని ఎన్నారై తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తెలిపారు. రూ.1200 కోట్లతో దళిత బంధు పథకం ప్రారంభంకానుందని ఇటీవల జరిగిన అఖిల పక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ తెలిపారని. మొద‌టి ద‌శ‌లో ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 100 కుటుంబాల చొప్పున‌ రాష్ట్ర‌వ్యాప్తంగా 11,900 కుటుంబాల‌కు ఆర్థిక సాయం అందిస్తారని అనిల్ తెలిపారు.  

అన్ని వర్గాల ఆశాజ్యోతిలా ముఖ్యమంత్రి కెసిఆర్ గారు దళితుల సాధికారత కోసం తెచ్చిన 'తెలంగాణ దళిత బంధు' పథకాన్ని ఎన్నారైలంతా హర్షిస్తున్నారని, పేదల పట్ల అణగారిన వర్గాల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్న ఏకైక నాయకుడు కెసిఆర్ మాత్రమేనని ఎన్నారైలంతా ప్రశంశించినట్టు అనిల్ కూర్మాచలం తెలిపారు. గత పాలకులంతా దళితులని ఓటు బ్యాంక్ లాగ మాత్రమే చూసారని ఎన్నడు కూడా వారి అభివృద్ధి కోసం పని చేయలేదని ఒక్క కెసిఆర్ గారు మాత్రమే దళితులంతా గౌరవంగా బతకాలని, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని అహర్నిశలు శ్రమిస్తున్ననారని మరి సందర్భం ఏదైనా కెసిఆర్ గారి నాయకత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. నాడు హుజురాబాద్ లో రైతు బంధు పథకం ప్రారంభించినప్పుడు ప్రత్యక్షంగా కార్యక్రమంలో పాల్గొన్నానని, అలాగే నేడు 'తెలంగాణ దళిత బంధు' పథకం ప్రారంభానికి కూడా హ్యాజరయ్యే అదృష్టం కలిగిందని అనిల్ కూర్మాచలం సంతోషం వ్యక్తం చేసి,అవకాశం కలిపించిన కెసిఆర్ గారికి మరియు స్థానిక నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు