భారతీయులు సౌదీకి రావచ్చు.. కానీ ఈ రూల్‌ పాటించాల్సిందే?

26 Nov, 2021 11:52 IST|Sakshi

కోవిడ్‌ ఆంక్షల నుంచి పలు దేశాల పౌరులకు సౌదీ అరేబియా మినహయింపు ఇచ్చింది. అయితే విదేశాల నుంచి సౌదీ అరేబియా వచ్చే పౌరులు తప్పకుండా కొన్ని నిబంధనలు పాటించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
భారత్‌తో పాటు
కోవిడ్‌ సంక్షోభం తలెత్తిన తర్వాత అంతర్జాతీయ ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం విధించింది. తమ రాజ్యంలోకి బయటి దేశాల వ్యక్తులను అనుమతించడం లేదు. అయితే ఇటీవల వ్యాక్సినేషన్‌ పెరగడంతో కోవిడ్‌ తగ్గుముఖం పట్టింది. దీంతో భారత్‌ , పాకిస్తాన్‌, ఇండోనేషియా, ఈజిప్టు, బ్రెజిల్‌, వియత్నాం దేశాల పౌరులు సౌదీలో అడుగు పెట్టేందుకు అనుమతి ఇచ్చింది.
క్వారంటైన్‌
అనుమతి పొందిన ఆరు దేశాల నుంచి సౌదీ వచ్చే పౌరులు తప్పని సరిగా 5 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనంటూ సౌదీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఆయా దేశాలలో రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటికీ తమ దేశంలో క్వారంటైన్‌లో ఉండాలని సూచించింది. డిసెంబరు 1 నుంచి తమ దేశంలోకి విదేశీ ప్రయాణికులను అనుమతిస్తామని తెలిపింది.
 

చదవండి: Saudi Arabia: రెసిడెన్సీ పర్మిట్లపై కొత్త చట్టం

మరిన్ని వార్తలు