డల్లాస్‌లో తానా, ఫేట్ ఫార్మసి ఆధ్వర్యంలో కోవిడ్ నివారణ కోసం టీకా సేవలు

6 Dec, 2021 19:27 IST|Sakshi

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), ఫేట్ ఫార్మసి ఆద్వర్యంలో కోవిడ్ నివారణ కోసం తెలుగు వారికి కోవిడ్ టీకాలను అందించారు. ప్రపంచం అంతా కోవిడ్ మహమ్మారితో తల్లడిల్లుతున్న తరుణంలో “మాస్క్ ధరించండి, శానిటైజర్ తప్పనిసరిగా వాడండి, ప్రతి ఒక్కరు కోవిడ్ టీకాలు తీసుకోండి” అనే నినాదంతో తానా(TANA) డాలస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన & తానా బృందం సారధ్యంలో టీకా సేవలు కార్యక్రమాన్ని నవంబరు 3, నవంబరు 14, నవంబరు 27 మరియు డిసెంబరు 4వ తేదీలలో తెలుగు వారి కోసం పిల్లలు (5 సం. నుంచి 11 సం. వరకు), పెద్దలు, భారత దేశం నుంచి వచ్చిన తల్లిదండ్రులకు ఫైజర్, మోడార్నా, జాన్సన్ & జాన్సన్ కోవిడ్ టీకాలను ఆరోగ్య భీమా వున్నా, లేకపోయినా 1200 పైచిలుకు టీకాలను అందించారు. 

కోవిడ్ టీకా కోసం వచ్చిన అందరు సభ్యులు, తానా & ఫేట్ ఫార్మసి వారికి ధన్యవాదలు తేలియజేశారు.ప్రవాసంలో వున్న తెలుగు వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందించాలన్న తానా(TANA) ముందుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ కష్ట కాలంలో ప్రతి ఒక్కరు కోవిడ్ మహమ్మారి నుంచి రక్షణ కల్పించే జాగ్రత్తలు - మాస్క్, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలని, ప్రతి ఒక్కరు కోవిడ్ టీకాలు తీసుకొని ఈ మహమ్మరిని నిర్మూలించాలని తెలియజేశారు. 

కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కాలంలో తానా(TANA) లాంటి స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించడానికి తోడ్పడుతున్నటు వంటి దాతలు & కార్యకర్తలకు తానా బృందం ధన్యవాదాలు తెలియజేశారు. తానా(TANA) డాలస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన మంచి కార్యక్రమాలతో అన్ని సంస్థలతో కలసి పనిచేసేందుకు తానా ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, రాబోయే కాలంలో జనప్రయోజనకరమైన కార్యక్రమాలు తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు గారి సహకారంతో మీ ముందుకు తీసుకువస్తామని, అందరు తానా నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు. 

కోవిడ్ టీకా కార్యక్రమంలో తానా కార్యవర్గ బృందం మురళీ వెన్నం, శ్రీకాంత్ పోలవరపు, లోకేష్ నాయుడు, రాజేష్ అడుసుమిల్లి, సాంబ దొడ్డ, పరమేష్ దేవినేని, నాగరాజు నలజుల, డా. ప్రసాద్ తోటకూర, కళ్యాణి తాడిమేటి, మధుమతి వైశ్యరాజు, దీప్తి సూర్యదేవర, చంద్ర పోలీస్, ప్రమోద్ నూతేటి, చినసత్యం వీర్నపు, శ్రీదేవి ఘట్టమనేని, లెనిన్ వీరా, గణెష్ నలజుల, వెంకట్ బొమ్మ తదితరులు మరియు ఫేట్ ఫార్మసీ అధినేత హరి చింతపల్లి, వారి బృందం ఎంతో శ్రమించి టీకా కోసం వచ్చిన ప్రతివక్కరికి టీకాలు అందించారు. టీకా కార్యక్రమం చేపట్టడానికి సహకరించిన ఫేట్ ఫార్మసి & వండర్ ల్యాండ్ మోంటిస్సొరీ వారికి, వివిధ ప్రసార మాధ్యమాలకు, వివిధ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు సతీష్ కొమ్మన కృతఙ్ఞతలు తెలియజేశారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు