Sakshi News home page

సుమతి సంగీత సేవలు వెలకట్టలేనివి

Published Sun, Nov 12 2023 1:48 AM

సుమతి రామ్మోహనరావుకు పురస్కారం 
అందిస్తున్న కృష్ణకుమారి, ప్రకాష్‌ తదితరులు - Sakshi

విజయవాడకల్చరల్‌: మృదంగ విద్వాంసురాలు దండమూడి సుమతి రామ్మోహనరావు సంగీత సేవలు వెలకట్టలేనివని విశ్రాంత ఆకాశవాణి సంచాలకులు ముంజులూరి కృష్ణకుమారి అన్నారు. శ్రీ సద్గురు సంగీత సభ 30 వార్షికోత్సవాల సందర్భంగా దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాలలో నిర్వహిస్తున్న సంగీత ఉత్సవాలు శనివారం ముగిసాయి. కార్యక్రమంలో భాగంగా మృదంగ విద్వాంసురాలు దండమూడి సుమతి రామ్మోహనరావుకు 2023 సంవత్సరానికి గానూ సంగీత విద్వన్‌మణి పురస్కారాన్ని అందించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణకుమారి మాట్లాడుతూ మహిళలు సంగీత రంగంలో పెద్ద సంఖ్యలో ఉన్పప్పటికీ మృదంగం రంగంలో తక్కువగా కనిపిస్తారన్నారు. సుమతి స్వయం

కృషి, గురువుల ఆశ్వీరాద బలంతో పద్మశ్రీ పురస్కారం దాకా ప్రయాణం చేసినట్లు తెలిపారు. సద్గురు సంగీత సభ ఉపాధ్యక్షుడు ప్రభాకర శాస్త్రి మాట్లాడుతూ సుమతి రామ్మోహనరావు ఎందరో విఖ్యాత విద్వాంసులకు వాద్య సహకారం అందించినట్లు చెప్పారు. శ్రీ సద్గురు సంగీత సభ అధ్యక్షుడు బీవీఎస్‌ ప్రకాష్‌, ప్రధాన కార్యదర్శి గౌరీనాథ్‌ పాల్గొన్నారు. సంగీత రంగాల్లో ప్రతిభ చూపిన వారికి నిర్వాహకులు ఆర్థిక సహాయం

అందజేశారు. కూచిపూడి నాట్యాచార్యులు డాక్టర్‌ చింతారవి బాలకృష్ణ నేతృత్వంలో కళాకారులు భక్త ప్రహ్లాద యక్షగానం ప్రదర్శించారు. నృసింహస్వామిగా జి.సత్యవెంకట ప్రసాద్‌, ప్రహ్లాదునిగా తపస్విని, హిరణ్య కశ్యపునిగా చింతారవి బాల

కృష్ణ, తదితరులు నృత్యాలను అభినయించారు.

విశ్రాంత ఆకాశవాణి సంచాలకులు

కృష్ణకుమారి

Advertisement

What’s your opinion

Advertisement