అహంకారంతో ఎన్నికల నోటిఫికేషన్‌..

23 Jan, 2021 14:02 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

సాక్షి, తాడేపల్లి: మూడేళ్ల పాటు నిద్రపోయిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. మూడు నెలల కోసం ఎందుకు తొందరపడుతున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబుకు అనుకూలమైన అధికారులతో..ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘నిమ్మగడ్డ సమావేశం పొలిటికల్‌ ప్రెస్‌మీట్‌లా అనిపించింది. 2018లో పంచాయతీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు?. ఎన్నికల నిర్వహణలో మూడేళ్లుగా ఈసీ ఎందుకు విఫలమైంది?.చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు.. ఈ న్యాయపోరాటం ఎక్కడికి పోయింది?.ఎన్నికల నిర్వహణ ఒక విధి అనే భావన ఎక్కడా కనిపించట్లేదు. అహంకారంతో ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చారని’’  అంబటి దుయ్యబట్టారు. చదవండి: బెదిరించేలా నిమ్మగడ్డ వ్యవహార శైలి: మల్లాది విష్ణు

తమకు ప్రజలు, ఉద్యోగుల ప్రాణాలు ముఖ్యమని ఆయన తెలిపారు. వ్యాక్సినేషన్‌, ఎన్నికలు ఒకేసారి నిర్వహించటం సాధ్యం కాదని.. వ్యాక్సినేషన్‌ చేస్తే కోవిడ్‌ తగ్గుతుంది. ఎన్నికలు నిర్వహిస్తే కోవిడ్‌ పెరుగుతుందన్నారు. వ్యాక్సినేషన్‌ ముఖ్యమా? ఎన్నికలు ముఖ్యమా?. ఎన్నికల్లో ఏకగ్రీవాలు కాకూడదా? అని ప్రశ్నించారు. ‘‘ఏకగ్రీవాలు జరిగిన చోట స్పెషల్‌ మోనటరింగ్‌ పెడతారంట. ఏకాభిప్రాయంతో ఏకగ్రీవాలు జరిగితే అభివృద్ధి సాధ్యం’’ అని తెలిపారు. నిమ్మగడ్డ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని.. ఎన్నికలు సజావుగా సాగకపోతే ప్రభుత్వానిదే బాధ్యత అంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.  నిమ్మగడ్డ వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నట్లు ఉన్నాయని అంబటి రాంబాబు మండిపడ్డారు. చదవండి: పంచాయతీ ఎన్నికలు బహిష్కరిస్తాం: చం‍ద్రశేఖర్‌ రెడ్డి

>
మరిన్ని వార్తలు