ఠాగూర్‌ కుర్చీలో కూర్చొని రాజీవ్‌గాంధీ టీ సేవించారు

9 Feb, 2021 20:34 IST|Sakshi

సాక్షి న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి తనపై చేసిన ఆరోపణలపై అమిత్ ‌షా గట్టి కౌంటర్‌ ఇచ్చారు. పశ్చిమబెంగాల్‌లోని శాంతికేతన్‌ పర్యటన సందర్భంగా రచయిత రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కూర్చీలో కూర్చొని అమిత్‌ షా అగౌరవపరిచారంటూ కాంగ్రెస్‌ నాయకుడు ఆరోపించారు. దీనిపై స్పందించిన అమిత్‌ షా..తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తమని, సీనియర్‌ నేత అయ్యిండి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం ఏంటని ఫైర్‌ అయ్యారు.  అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ నేతలే రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ని అవమానించారని, ఇందుకు సాక్ష్యాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. (మహారాష్ట్రలో మూడు చక్రాల పాలన)

గతంలో మాజీ ప్రధాని జవహార్‌లాల్‌ నెహ్రూ.. ఠాగూర్‌ కుర్చీలో కూర్చున్నారని, రాజీవ్‌ గాంధీ అక్కడ టీ కూడా సేవించారని షా తెలిపారు. దీనికి సంబంధించిన  ఫోటోలు చూసిన అనంతరం ఠాగూర్‌ను ఎవరు అగౌరవపరిచారో చెప్పాలని సవాల్‌ విసిరారు.  తాను సందర్శకుల పుస్తకంలో సంతకం చేయడానికి కిటికీ వద్ద  కూర్చున్నానని, గతంలో ప్రణబ్ ముఖర్జీ, రాజీవ్ గాంధీ కూడా అక్కడ కూర్చున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా అమిత్‌ షా సభ ముందు ఉంచారు. మరోవైపు షాపై అధిర్‌ రంజన్‌ చౌదరి చేసిన ఆరోపణల్ని శాంతినికేతన్‌ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ బిద్యూత్ చక్రవర్తి కూడా తోసిపుచ్చారు. ఈ మేరకు వివరణ ఇస్తూ ఓ లేఖను విడుదల చేశారు. (గొప్ప స్నేహితుడు :  రాజ్యసభలో మోదీ కన్నీరు)

మరిన్ని వార్తలు