యెల్లో మీడియా అబద్ధాల పంట పండిస్తోంది: అసత్య కథనాలపై మంత్రి కాకాణి

13 Jul, 2022 14:48 IST|Sakshi

సాక్షి, అమరావతి:  ఎమ్మెల్యేగా ఓడిన పవన్‌ కల్యాణ్‌, తప్పుడు ప్రచారాలు చేస్తున్న చంద్రబాబు వ్యాఖ్యలకు ఎల్లో మీడియా ఎంత ప్రాధాన్యం ఇస్తుందో ప్రజలంతా చూస్తున్నారని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. బుధవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

పాస్ బుక్ ఉన్న రైతులకు, సీసీఆర్సీ కార్డు ఉన్న రైతు ఆత్మహత్య చేసుకుంటే పరిహారం ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలు నిరూపించగలరా? నేను సవాల్‌ చేస్తున్నా. చంద్రబాబుకి క్రెడిబిలిటీ లేదు..పవన్ కళ్యాణ్‌కి క్యారెక్టర్ లేదు. వీళ్ళ మాటల్ని పట్టుకుని ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోంది. అవాస్తవాలు చూపిస్తోంది. అన్నదాతలు అప్పుల సాగు కాదు.. వాస్తవంగా ఎల్లో మీడియా అబద్ధాల సాగు కనిపిస్తోంది ఇప్పుడు అంటూ మండిపడ్డారు మంత్రి కాకాణి. 

‘‘రైతులకు రూ. 7 లక్షల పరిహారం ఇస్తున్నాం. టీడీపీ హయాంలో రూ. 5 లక్షలని చెప్పి చాలా ఆంక్షలు పెట్టారు. చంద్రబాబు హయాంలో ఆత్మహత్యలు ను కూడా గుర్తించకుండా వాళ్ళకి అన్యాయం చేశాడు. సుమారు 471 మంది రైతులు చంద్రబాబు హయాంలో ఇవ్వకపోతే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పరిహారం ఇచ్చి అండగా నిలబడింది. కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డు లేకపోతే లక్ష రూపాయలు బీమా కింద ఇస్తున్నాం. క్రాప్ హాలిడే అన్నదే లేదు.. ఎక్కడా కరువు మండలాల ప్రకటించలేదు. ఈ ఏడాది ఎన్నడూ లేనివిధంగా ముందుగా నీళ్లు ఇస్తున్నాం. చంద్రబాబు లాగా రుణమాఫీ పేరు చెప్పి మోసం చెయ్యలేదు. ప్రతి రైతుకు ఇప్పుడు రైతు భరోసా ఇస్తున్నాం’’ అని మంత్రి కాకాణి స్పష్టం చేశారు.

ప్లీనరీ తరువాత దుష్టచతుష్టయానికి కడుపు మంట పెరిగింది. అందుకే వాళ్ల కోసం చర్చించాం.ఎమ్మెల్యే గా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఎల్లో మీడియా ఎంత ప్రాధాన్యం ఇస్తుందో చూస్తున్నాం. చంద్రబాబు కోసం ఎల్లో మీడియా ఎలా వ్యవహరిస్తుందో అసత్యపు కథనాలు, తప్పుడు రాతలే  నిదర్శనం అని మంత్రి కాకాణి చెప్పారు.

మరిన్ని వార్తలు