ఫామ్‌హౌజ్‌లలో ఉన్నా వదిలేది లేదు: బండి సంజయ్‌

25 Feb, 2021 20:52 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి : రైతులకు సన్న వడ్ల రకాలు వేయాలని చెప్పిన సీఎం కేసీఆర్‌ తన ఫామ్‌హౌస్‌లో దొడ్డు రకాలు వేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. బాన్సువాడలో బీజేపీ ఏర్పాటు చేసిన సమావేశంలో బండి సంజయ​ ప్రసంగించారు. ఈ మేరకు పీఎన్‌బీ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు నీరవ్‌ మోదీ లాగా దొంగలు ఎక్కడున్న వదిలేది లేదని బండి సంజయ్‌ పేర్కొన్నారు. తెలంగాణలో ఫామ్‌హౌజ్‌లలో ఉన్నా వదిలేది లేదని పరోక్షంగా సీఎం కేసీఆర్‌ను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ నాయకులు గ్రామల్లోకి వస్తే సీఎం కేసీఆర్‌ నిరుద్యోగ భృతి ఏదని నిలదీయాలని పిలుపునిచ్చారు.

కేంద్రంలోని బీజేపీ ఇస్తున్న నిధులను టీఆర్ఎస్ సర్కార్ ఫొటోలూ పేర్లు మార్చి మోసం చేస్తోందని ఆరోపించారు. బీజేపీని మతతత్వ పార్టీగా టీఆర్ఎస్ చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ ఏ మతానికి వర్గానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. 2023 లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. రామరాజ్యం రావాలంటే రామ భక్తులకు అవకాశం ఇవ్వాలని కోరారు. బీజేపీ కార్యకర్తలను బెదిరించి కేసులు పెడితే ఊరుకోమని హెచ్చరించారు. 

బాన్సువాడ వెనుబడిన నియోజకవర్గంగా మిగిలిపోయిందని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ అన్నారు. కేసీఆర్ బంగారు తెలంగాణలో బాన్సువాడ ఉందో లేదో తెలియదన్నారు. బాన్సువాడను ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్‌కు అమ్మేశాడని విమర్శించారు. కారు రథసారథి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ చేతుల్లో ఉందని తెలిపారు. కేసీఆర్ స్టీరింగ్ ఎటు తిప్పుమంటే అటు తిప్పుతారని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు