రేవంత్‌ కన్నా కేసీఆర్‌ బెటర్‌: ఎంపీ అర్వింద్‌ వ్యాఖ్యలు

25 Nov, 2023 14:47 IST|Sakshi

సాక్షి, జగిత్యాల: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా, బీజేపీ ఎంపీ, కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కాన్నా సీఎం కేసీఆర్‌ బెటర్‌ అంటూ వ్యాఖ్యలు చేశారు. 

కాగా, ఎంపీ అర్వింద్‌ జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో కార్నార్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా అర్వింద్‌ మాట్లాడుతూ.. రేవంత్‌ కంటే కేసీఆర్‌ మేలు. సీఎం కేసీఆర్‌ పదేళ్ల పాటు తెలంగాణ కోసం పోరాడారు. కేసీఆర్ కొట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నాడు, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశాడు. ఇప్పుడు చంద్రబాబు చెప్పినట్లు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడుకు సంబంధించిన నాయకులంతా ఇప్పుడు కాంగ్రెస్‌లోనే ఉన్నారు.

2018 ఎన్నికల్లో హైదరాబాద్ నేనే కట్టానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?. కాంగ్రెస్‌కు ఓటు వేశారో తెలంగాణను తీసుకువెళ్లి ఆంధ్రాలో  ఉన్న తెలుగుదేశం చేతిలో పెట్టినట్టే అని సంచలన కామెంట్స్‌ చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణను హోల్ సేల్‌గా అమ్మేస్తాడు. చంద్రబాబు కోసం సంచులను మోసుకెళ్లాడు అంటూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు. 

మరిన్ని వార్తలు