ప్రియాంకకు చరిత్ర తెలియకపోవడం దురుదృష్టకరం: కేటీఆర్‌

25 Nov, 2023 14:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు కాంగ్రెస్‌ పార్టీ చాలా అన్యాయం చేసిందని, ఈ చరిత్ర గురించి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీకి ఏ మాత్రం అవగాహన లేకపోవడం నిజంగా దురదృష్టకరమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పీవీ మనందరం అభిమానించే గొప్ప వ్యక్తి అని, మట్టిలో పుట్టిన మాణక్యమని తెలిపారు.  తన జీవితమంతాకాంగ్రెస్‌ పార్టీ కోసం సేవ చేసిన వ్యక్తని పేర్కొన్నారు. అలాంటి నిరాడంబరమైన వ్యక్తిని కాంగ్రెస్‌ పార్టీ దారుణంగా అవమానించిందని మంత్రి చెప్పారు.

ప్రధానమంత్రి ఉన్న పీవీ నర్సింహరావుకు 1996లో పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో ఎంపీ టికెట్‌ నిరాకరించి ఘోరంగా అవమానించారని కేటీఆర్‌ ప్రస్తావించారు., ఆయన చనిపోయిన తర్వాత కూడా కనీసం 24 అక్బర్‌ రోడ్డులోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలోకి కూడా ఆయన భౌతిక కాయాన్ని అనుమతించలేదని గుర్తు చేశారు.చరిత్ర గురించి ప్రియాంకాగాంధీకి అవగాహన లేకపోవడం దారుణమని అన్నారు. పీవీ కుటుంబానికి రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.
చదవండి: మోదీకి కేసీఆర్‌, ఓవైసీ స్నేహితులు: రాహుల్‌ గాంధీ

మరిన్ని వార్తలు