అక్కడికి వద్దన్నా వెళ్లిన మోత్కుపల్లి.. బీజేపీ సీరియస్‌!

27 Jun, 2021 18:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై బీజేపీ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసలు కురిపించారు. దళితుల అభివృద్ధిపై అఖిలపక్షం నిర్వహించడం అభినందనీయమన్నారు. మరియమ్మ లాకప్‌డెత్‌ అంశంలో చర్యలు తీసుకోవడం ద్వారా.. ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందంటూ ఆయన అభినందించారు. ప్రగతిభవన్‌లో ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 'సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్‌' పథకం విధి విధానాలపై అఖిలపక్షం చర్చించింది. కాంగ్రెస్ నేత భట్టి‌ విక్రమార్క, ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రి, సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం ఈ భేటీకి హాజరయ్యారు.

మోత్కుపల్లి వ్యవహారంపై బీజేపీ సీరియస్‌
ఇదిలా ఉండగా, అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించగా, ఆ ఆదేశాలు పట్టించుకోకుండా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హాజరయ్యారు. అదే సమయంలో బీజేపీ కార్యాలయంలో దళిత నేతల భేటీకి ఆయన డుమ్మా కొట్టారు. దీంతో మోత్కుపల్లి వ్యవహారంపై బీజేపీ సీరియస్‌ అయినట్లు తెలిసింది. వద్దన్నా వినకుండా అఖిపక్ష భేటీకి హాజరు కావాల్సిన అవసరం ఏమొచ్చిందని పార్టీ పెద్దలు వ్యాఖ్యానించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

చదవండి: సఫాయన్నా నీకు సలాం అన్న: సీఎం కేసీఆర్‌
Balka Suman: ఈటల ‘లేఖ’ నిజమే! 

మరిన్ని వార్తలు