Evening Top 10 News: తెలుగు తాజా వార్తలు 10

31 Jul, 2022 17:56 IST|Sakshi

1. మనీలాండరింగ్ కేసులో సంజయ్‌ రౌత్‌ను అరెస్టు చేసిన ఈడీ
శివసేన ముఖ్యనేత, రాజ్యసభ ఎంపీ సంజయ్‌ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ముంబైలోని  ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన కొద్ది గంటలకే అదుపులోకి తీసుకున్నారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. రాష్ట్రపతి అంటే మర్యాద లేకుండా మాట్లాడారు.. స్మృతి ఇరానీ క్షమాపణలు చెప్పాలి
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ లోక్‍సభాపక్షనేత అధిర్ రంజన్ చౌదరి. గురువారం పార్లమెంటులో రాష్ట్రపతి అంటే గౌరవం లేకుండా ఆమె మాట్లాడారని ఆరోపించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. లోన్‌ యాప్స్‌ ఆగడాలపై పూర్తి స్థాయిలో నిఘా: ఏపీ డీజీపీ
లోన్‌ యాప్స్‌ ఆగడాలపై లోతుగా విచారణ చేస్తున్నామని.. వీటిపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టామని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ, ప్రజా ప్రతినిధులతో దురుసుగా ప్రవర్తించిన నలుగురిని అరెస్ట్‌ చేశామన్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. అమెరికాలో మంకీపాక్స్‌ కలకలం... అత్యవసర పరిస్థితిని ప్రకటించిన అధికారులు
అమెరికాలో మంకీపాక్స్‌ కలకలం సృష్టించింది. ఈ మేరకు అమెరికాలోని  న్యూయార్క్‌ నగరం మంకీపాక్స్‌ వ్యాప్తికి కేంద్రంగా ఉందని, దాదాపు లక్ష మందికి పైగా  ఈ వ్యాధి భారిన పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. మీరు ప్రాణాలతో ఉన్నారంటే ప్రధాని మోదీనే కారణం.. పాకిస్థాన్ పరిస్థితి చూడండి..
ప్రధాని నరేంద్రమోదీని ఆకాశానికి ఎత్తారు బిహార్ మంత్రి, బీజేపీ నేత రామ్‌ సూరత్ రాయ్. ప్రజలు ఇప్పుడు బతికున్నారంటే అది మోదీ చలవే అన్నారు. కరోనా సమయంలో వ్యాక్సిన్ తయారు చేసి, ప్రజలందరికీ ఉచితంగా టీకా డోసులు అందించి అందరి ప్రాణాలను ప్రధాని కాపాడారని పేర్కొన్నారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ఆగస్ట్‌ ఒకటి నుంచి మారనున్న కొత్త రూల్స్‌..! ఇవే..!
ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చిదంటే చాలు సామాన్యుడి జీవితంపై ప్రభావం చూపేలా కొన్ని కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. దేశంలో కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఆగస్ట్‌ 1 నుంచి మారబోయే అంశాలేంటో తెలుసుకుందాం. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. కోహ్లిని ఆసియాకప్‌కు ఎంపిక చేయకపోవచ్చు: పాక్‌ మాజీ ఆటగాడు
టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి గత కొంత కాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లి సెంచరీ సాధించి మూడేళ్ల దాటిపోయింది. ఐపీఎల్‌లో నిరాశపరిచిన కోహ్లి.. అనంతరం ఇంగ్లండ్‌ పర్యటనలోనూ తన పేలవ ఫామ్‌ను కొనసాగించాడు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. అనసూయ స్థానంలో కొత్త యాంకర్‌, ఎవరో తెలుసా?
అనసూయ.. డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ యాంకర్‌.. అటు సినిమాలు చేసుకుంటూనే ఇటు బుల్లితెరపైనా పలు షోలతో అలరిస్తోంది. తనకు నచ్చినట్లుగా రెడీ అవుతూ ఎవరేమన్నా పట్టించుకోకుండా ముందుకెళ్లిందీ ముద్దుగుమ్మ. అయితే కొన్నేళ్లుగా యాంకర్‌గా కొనసాగుతున్న ఓ కామెడీ షోకు అనసూయ ఇటీవలే గుడ్‌బై చెప్పేసింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. పిట్ట రెట్టలతోనూ ప్రమాదమే.. జర భద్రం..!
గాలిలో, వాతావరణంలో, పరిసరాల్లో వ్యాపించే మనకు సరిపడని అనేక రేణువులూ, వాసనలూ,  వస్తువులతో వచ్చే ఊపిరితిత్తుల సమస్యే ‘హైపర్‌ సెన్సిటివిటీ నిమోనైటిస్‌’. తాజాగా ఇప్పుడు తొలకరి కూడా మొదలైంది. దాంతో గడ్డి తడిసి ఒకరకమైన వాసన వచ్చే ఈ సీజన్‌లో ఈ ముప్పు మరింత ఎక్కువ.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. Viral Video: వీల్‌చైర్‌లో ఫుడ్ డెలివరీ.. నెటిజన్ల ప్రశంసలు
ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్‌లు అధికమవ్వడంతో డెలివరీ బాయ్‌లు కూడా పెరిగిపోయారు. చాలా మంది యువత పార్ట్‌టైం జాబ్‌ కింద డెలివరీబాయ్‌లా పనిచేస్తూ ఆదాయాన్ని సృష్టించుకుంటున్నారు.  తాజాగా వీల్‌చైర్‌లో కూర్చొని ఫుడ్‌ డెలివరీ చేస్తున్న ఓ దివ్యాంగుడి వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు