గర్భిణులకు వైద్య పరీక్షలు | Sakshi
Sakshi News home page

గర్భిణులకు వైద్య పరీక్షలు

Published Fri, Nov 10 2023 5:34 AM

-

రంపచోడవరం: ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్‌(పీఎస్‌ఎంఏ) లో భాగంగా గర్భిణులకు అవగాహన కార్యక్రమాన్ని గురువారం రంపచోడవరం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.లక్ష్మి నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ సుమారు 62 మంది గర్భిణులకు వివిధ రకాల వైద్య సేవలు అందించినట్టు చెప్పారు. గర్భిణులు పౌష్టికాహారం తీసుకుంటే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఎటువంటి సమస్యలు లేకుండా పుడతారన్నారు.

రెండు రోజుల పాటు క్యాంపు జరుగుతుందన్నారు. గర్భిణులు పాటించవలసిన జాగ్రత్తలను వివరించారు. గర్భిణీలకు స్కానింగ్‌, బ్లడ్‌టెస్ట్‌లు చేసి మందులు అందజేశారు. ఆసుపత్రి కౌన్సిలర్‌ వాసు, పర్సనల్‌ హుస్సేన్‌ పలు అంశాలపై కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

వై.రామవరం: పి యమ్‌ ఎస్‌ ఎమ్‌ ఏ కార్యక్రమంలో బాగంగా మండలంలోని చవిటిదిబ్బలు పీహెచ్‌సీలో వైద్యాధికారులు డాక్టర్‌ దినేష్‌, నరేంద్రల ఆధ్వర్యంలో 82 మంది గర్భిణులకు వైద్య పరీక్షలు చేసి, మందులు అందజేశారు. హైరిస్క్‌ ఉన్న నలుగురు గర్భిణులను పీహెచ్‌సీలో చేర్పించారు. శిబిరానికి వచ్చిన వారికి భోజన సదుపాయం కల్పించారు.

Advertisement
Advertisement