ఆజాద్ సరైన అంశాలే లేవనెత్తారు.. కాంగ్రెస్‌ పని అయిపోయింది..

27 Aug, 2022 20:06 IST|Sakshi

ముంబై: కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న ఓడ అని అన్నారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర పఢ్నవీస్. ఈ ఓడ ఇక పైకి రాదని తెలిసిన వాళ్లంతా ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నారని పేర్కొన్నారు. నాగ్‌పూర్‌ ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీని వీడుతూ గులాం నబీ ఆజాద్ సరైన అంశాలనే లేవనెత్తారని ఫడ్నవీస్ అన్నారు. అయితే అవన్నీ ఆ పార్టీ అంతర్గత విషయాలని పేర్కొన్నారు. అందుకే వాటిపై స్పందించాలనుకోవట్లేదని చెప్పారు. మరోవైవు మరాఠీ సంస్థ సంభాజీ బ్రిగేడ్‌తో శివసేన జట్టుకట్టిన విషయంపైనా ఫడ్నవీస్ స్పందించారు. ఒకరి పతనానికి సమయం ఆసన్నమైనప్పుడు తెలివిగా ఆలోచించలేరని వ్యాఖ్యానించారు.
చదవండి: బీజేపీ నిరక్షరాస్యుల పార్టీ.. మనీశ్ సిసోడియా ఫైర్‌

మరిన్ని వార్తలు