కశ్మీర్‌పై రాజకీయాలు వద్దు

6 Jun, 2022 05:54 IST|Sakshi

టార్గెట్‌ కిల్లింగ్స్‌ ఆపేందుకు యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలి

ఢిల్లీ సీఎం కేజ్రివాల్‌ డిమాండ్‌

న్యూఢిల్లి: జమ్మూకశ్మీర్‌లో ముష్కరుల దాడుల వల్ల కశ్మీరీ పండిట్లు బలవంతంగా వలస వెళ్లాల్సి వస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్‌ చెప్పారు. పండిట్లు కశ్మీర్‌ లోయను వదిలి, బతుకు జీవుడా అంటూ సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నారని గుర్తుచేశారు. ఓ వర్గంపై దాడులను, టార్గెట్‌ కిల్లింగ్స్‌ను ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని డిమాండ్‌ చేశారు.

ఆప్‌ ఆదివారం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిర్వహించిన ‘జన ఆక్రోశ్‌ ర్యాలీ’లో కేజ్రివాల్‌ మాట్లాడారు.  పండిట్ల దుస్థితిని చూస్తే అధికార బీజేపీకి నీచ రాజకీయాలు చేయడం తప్ప పరిస్థితిని చక్కదిద్దే సత్తా లేదని తెలిసిపోతోందని వ్యాఖ్యానించారు.   ఇండియా గనుక దృఢమైన నిర్ణయం తీసుకుంటే పాకిస్తాన్‌ అనే దేశం మిగలదన్నారు. ఇలా ఉండగా, జమ్మూకశ్మీర్‌లో పండిట్లను, ముస్లిం భద్రతా సిబ్బందిని ఉగ్రవాదులు హత్య చేస్తుంటే,  కేంద్ర ప్రభుత్వం కొన్ని సినిమాల ప్రమోషన్‌లో బిజీ ఉందని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు