దళిత బంధు రాదంటూ ఈటల తప్పుడు ప్రచారం: మంత్రి హరీశ్‌ రావు

5 Sep, 2021 17:36 IST|Sakshi
ఫైల్ ఫోటో

కరీంనగర్‌: దళిత బంధు రాదంటూ ఈటల తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈటల రాజేందర్‌ చెప్పే మోసపూరిత మాటలు నమ్మొద్దని హరీశ్‌రావు సూచించారు.  ప్రతి దళిత కుటుంబానికి 9లక్షల 90వేలు వస్తున్నట్లు మేసేజ్‌లు వస్తున్నాయన్నారు. హుజురాబాద్ దళిత బంధు విజయం రాష్ట్రానికి, దేశానికి ఆదర్శం కావాలన్నారు. దళిత బంధుకు పైసలు ఎక్కడివి అని ఈటల అన్నారని, కానీ ఇప్పుడు అందరికీ దళిత బంధు వస్తుందని తెలిపారు. దీనికి ఈటల ఏం చెబుతారని ప్రశ్నించారు.

కాగా హుజురాబాద్‌లో పోటాపోటీ ప్రచారాలు మొదలయ్యాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ జమ్మికుంటలో సభను ఏర్పాటు చేసింది. బీజేపీ గోడ గడియారాలను, గొడుగులను సభలో ఓ యువకుడు ధ్వంసం చేశాడు. గోడ గడియారాలు భరోసానిస్తాయా అంటూ ప్రశ్నించారు. మంత్రులు హరీశ్‌ రావు, కొప్పుల వేదికపై ఉండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కొరుకంటి చందర్, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, కౌశిక్ రెడ్డిలు పాల్గొన్నారు.

చదవండి: Huzurabad Bypoll: ఉప ఎన్నికపై ఈసీకి నివేదిక పంపాలి

మరిన్ని వార్తలు