ఆధారాలు చూపించు.. లేదా క్షమాపణ చెప్పు

13 May, 2022 01:18 IST|Sakshi

బండి సంజయ్‌కు కేటీఆర్‌ హెచ్చరిక 

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ట్విట్టర్‌ వేదికగా చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా స్పందించారు. నిరాధార ఆరోపణలు కొనసాగిస్తే .. న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. గురువారం సంజయ్‌ ట్విట్టర్‌లో, ‘మంత్రి కేటీఆర్‌ నిర్వాకం వల్ల 27 మంది ఇంటర్‌ విద్యార్థులు మరణిస్తే కనీసం స్పందించని దౌర్భాగ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌..! అని కామెంట్‌ పెట్టారు. దీనిని తీవ్రంగా పరిగణించిన కేటీఆర్‌.. బండి సంజయ్‌ను బీఎస్‌ కుమార్‌గా సంబోధిస్తూ.. ‘చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించు. లేదంటే బహిరంగ క్షమాపణలు చెప్పు’అని ట్వీట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు