Maharashtra Political Crisis: ‘మహా’పతనం: అసోం సీఎం సంచలన వ్యాఖ్యలు

25 Jun, 2022 15:34 IST|Sakshi

గువహటి: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. అసోంలో వరదలపై దృష్టి పెట్టకుండా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు గౌహతి హోటల్‌లో ఆతిథ్యమిచ్చారనే ఆరోపణలపై ఆయన స్పందించారు. మహారాష్ట్ర రెబల్‌ ఎమ్మెల్యేలకు బీజేపీ మద్దతు ఉందని పేర్కొన్నారు. ‘మహా’ సంక్షోభంలో జోక్యం చేసుకోనని చెప్పారు. అసోంకు వచ్చే అతిథులు ఎవరైనా వారికి రక్షణ కల్పించడం మా బాధ్యత అన్నారు.
చదవండి: తెర మీదకు శివసేన కొత్త పార్టీ!.. అగ్గి రాజుకుంటుందని హెచ్చరికలు

మరో వైపు మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం కీలక దశకు చేరుకుంది. రెబల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు రంగం సిద్ధమైంది. 16  మందికి ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్‌ నోటీసులు జారీ చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు గ్రూప్‌ లీడర్‌ ఏక్‌నాథ్‌ షిండే ప్రకటించారు. ఈ మేరకు డిప్యూటీ స్పీకర్‌కు లేఖ రాసే యోచనలో ఉన్నారు షిండే. అయితే కొత్త పార్టీ పేరు శివసేన(బాలాసాహెచ్‌)గా ఉండొచ్చని షిండే వర్గీయులు చెప్తున్నారు. బాల్‌థాక్రే సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ ఉండబోతున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు