కోమటిరెడ్డి గురించి మరోసారి మాట్లాడుదాం.. మీటింగ్‌లో ఠాక్రే సీరియస్‌!

15 Feb, 2023 19:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన కామెంట్స్‌ వేళ పీసీసీ ఉపాధ్యక్షులతో ఇంఛార్జ్‌ మాణిక్‌రావ్‌ ఠాక్రే సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రపై సమీక్ష చేపట్టారు. ఈ క్రమంలోనే కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కూడా ఠాక్రే స్పందించారు. 

సమావేశం సందర్భంగా మాణిక్‌రావు ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఠాక్రే మాట్లాడుతూ.. కోమటిరెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్‌కు ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని రాహుల్‌ గాంధీ చెప్పిన విషయాన్నే తాను చెప్పానన్నారు. కాంగ్రెస్‌ నేతలందరూ ఐక్యంగానే ఉన్నారు. త్వరలో పాదయాత్రలో పాల్గొంటారు. ఒంటిరిగానే ఎన్నికలకు వెళ్తాం, విజయం సాధిస్తామని స్పష్టం చేశారు. 

ఇదే సమయంలో పీసీసీ ఉపాధ్యక్షుల తీరుపై ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి 20 మంది ఉపాధ్యక్షులు హాజరుకాకపోవడంతో సీరియస్‌ అయ్యారు. సమావేశానికి హాజరుకానీ వారందరూ వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే శుక్రవారం మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షులు.. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి వ్యవహారంపై మరోసారి మాట్లాడుకుందామని నేతలకు ఠాక్రే సర్ది చెప్పారు. 


 
 

మరిన్ని వార్తలు