‘కేటీఆర్‌.. ఏపీకి రండి.. అభివృద్ధి చూపిస్తాం’

29 Apr, 2022 15:38 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

మంత్రి జోగి రమేష్‌

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సంక్షేమం దేశానికే ఆదర్శమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాల మంత్రులే ఏపీకి వచ్చి ఇక్కడి పరిస్థితులను చూసి వెళ్తుతున్నారన్నారు.  మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్మిస్తున్నారన్నారు.

చదవండి: హైదరాబాద్‌లోనే కరెంట్‌ లేదు: కేటీఆర్‌ వ్యాఖ్యలకు మంత్రి బొత్స కౌంటర్‌ 

‘‘ఏపీలో జగనన్న కాలనీల పేరుతో భారీ ఎత్తున ఊళ్లే నిర్మాణమవుతున్నాయి. రైతు భరోసా కేంద్రాల పనితీరు పై దేశమే ఏపీ వైపు చూస్తోంది. వాళ్ల రాష్ట్రాల్లో కూడా ఆర్బీకేలను ప్రవేశపెట్టాలని అనేక రాష్ట్రాలు చూస్తున్నాయి. చీఫ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్ విధానం ఏ రాష్ట్రంలోనైనా ఉందా? ఏపీలో మాత్రమే సాధ్యమవుతోంది. ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని కనులారా చూడాలని కేటీఆర్‌ను ఆహ్వానిస్తున్నా. ఏపీపై ఎవరూ బురద చల్లలేరు ... అలాంటి ఆలోచనలు ఉన్నా విరమించుకోవాలని కోరుతున్నా. దేశంలో ఏ రాష్ట్రమైనా సామాజిక న్యాయం చేయగలిగిందా?. బహు జనులు , ఎస్సీ, ఎస్టీలు గొంతెత్తి అరిచినా ఎవరూ ఇవ్వలేకపోయారు. ఏపీలో వైఎస్‌ జగన్‌ వల్లే సామాజిక న్యాయం సాధ్యమైంది. ఇంటి వద్దకే పాలన అందిస్తున్న మనసున్న సీఎం వైఎస్ జగన్’’ అని మంత్రి జోగి రమేష్‌ అన్నారు.

మరిన్ని వార్తలు