సిగ్గు వదిలేసి.. ఈ పిచ్చి(పచ్చ) ప్రేమ ఏంది పవన్‌?

2 Dec, 2023 09:08 IST|Sakshi

జనసేన టీడీపీ పొత్తుపై వ్యతిరేకంగా ఏ స్థాయి నాయకులు మాట్లాడినా.. చిన్న కార్యకర్త మాట్లాడినా ఊరుకునేది లేదు. అలాంటివారిని వైఎస్సార్‌సీపీ కోవర్టులుగా భావిస్తాం. గట్టి చర్యలు తీసుకుంటాం. ఈ నిర్ణయం నచ్చనివాళ్లు ఎవరైనా ఉంటే వెళ్లిపోవచ్చు.. 

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తాజాగా చేసిన ప్రకటన ఇది. పదేళ్లుగా నమ్ముకున్న పార్టీ నేతల్ని, కార్యకర్తల మనోభావాల్ని ఏమాత్రం పట్టించుకోకుండా..  ఆత్మగౌరవాన్ని తుంగలో తొక్కుతూ పక్క పార్టీ జెండా మోయాలంటూ నిసిగ్గుగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో మేధావులు, నేతలు, సాధారణ పౌరులు.. ఆఖరికి జనసేన అసంతృప్తులు సంధిస్తున్న ప్రశ్నలకు పవన్‌ దగ్గర సమాధానాలు ఉన్నాయంటారా?


కోట్ల మంది ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఈ పొత్తుకు తూట్లు పొడిస్తే జనసేనకో, పవన్‌ కల్యాణ్‌కో తూట్లు పొడిచినట్లు కాదు. ఏ ప్రజల కోసం నిలబడాలనుకుంటున్నామో దానికి తూట్లు పొడుస్తున్నట్లు. అందుకే అలాంటి చర్యలను సహించను!

  • ప్రజల తరఫునే నిలబడాలనుకుంటే ఒంటరి పోరుకు వెళ్లొచ్చు కదా. నిజంగా ప్రజల కోసం పోరాడితే.. వాళ్లు ఆదరించకుండా ఉంటారా?. అసలు ఇవన్నీ ఎందుకు.. చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతి ఒక్కసారైనా ప్రశ్నించొచ్చు కదా!. ఆ అవినీతి ఏస్థాయిలో ఉన్నా.. సహిస్తూ మౌనంగానే ఉంటారా?. టీడీపీతో పొత్తు తన కోసం, తన ప్యాకేజీ కోసం అని పవన్‌ చెప్పినా అయిపోవు కదా!.     

దశాబ్ద కాలంపాటు ఎవరున్నా లేకపోయినా పార్టీని నడిపిన వ్యక్తి.. ఏ నిర్ణయం తీసుకున్నా మనందరికీ మంచి జరిగేలా, రాష్ట్రానికి మేలు చేసేలా, తెలుగు ప్రజలకు అండగా ఉండేలా నిర్ణయం తీసుకుంటాడని సంపూర్ణంగా నమ్మితే మీరు సందేహించరు. గొడవలు పెట్టుకోరు.

  • జనసేనకు ఇవాళ ఆరు లక్షల కార్యకర్తల బలం ఉందనే పవనే అంటారు. వాళ్లు మనుషుల్లాగా కనిపించడం లేదా?. పవన్‌ సభలకు వచ్చేవాళ్లు సంకర జాతి నా కొడుకులు.. అలగా జనం అని బాలయ్యే అన్నారంటూ పవనే స్వయంగా చెప్పారు. ఆ సంగతి ‘సిగ్గు లేకుండా’ రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్‌ మరిచిపోయినా.. జనసైనికులు మరిచిపోతారంటారా?.  గతంలో కలిసి నడిచిన సమయంలో టీడీపీ కేడర్‌ తమను చిన్నచూపు చూసిన విషయం.. అవమానించిన విషయం ఇంకా కళ్ల ముందు పవన్‌ చెబుతున్నారా?. యువతలో తమ పార్టీకి ఉన్న ఫాలోయింగ్ చూసి ఢిల్లీ పెద్దలే ఆశ్చర్యపోయారని పవన్‌ అన్నారు. మరి వాళ్ల కోసం అయినా 
     

నన్ను ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్‌ షా, చంద్రబాబు అర్థం చేసుకుంటారు. నేను పెంచి అండగా ఉన్న నాయకులు అర్థం చేసుకోరు. ఎక్కడుంది లోపం? జాతీయ స్థాయిలో నాకు ఉన్న దృష్టి, మనవాళ్లకు ఎందుకు అర్థం కాదు? మోదీ అంతటి వ్యక్తి అర్థం చేసుకుంటే ఇక్కడి కొందరు నాయకులు మిడిమిడి జ్ఞానంతో ఎందుకు ఉంటారు? నా నిర్ణయాలను సందేహించేవారు వెళ్లిపోవచ్చు.  పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా సీరియస్‌గా తీసుకుంటాను. తెదేపాను తగ్గించేలా మన నాయకులు ఎవరూ మాట్లాడినా సహించేది లేదు. నేను మొండి వ్యక్తిని, భావజాలాన్ని నమ్మినవాణ్ని. రాజకీయాల్లో ఎవరూ ఎవరినీ బతిమాలరు. 

  • పవన్‌ ఉంది జాతీయ స్థాయి నేతల్నో.. లేదంటే ఆయన దత్తతండ్రి చంద్రబాబునో మెప్పించడానికి.. ప్రసన్నం చేసుకోవడానికి కాదు. రాజకీయాల్లోకి వచ్చి.. పార్టీని పెట్టి.. ఒక సిద్ధాంతం ప్రకారం పార్టీని నడిపించాల్సి ఉంటుంది.  అవేవీ చేయకపోతే తనను, తన తలాలోక.. తలతిక్క నిర్ణయాల్ని అర్థం చేసుకోవాలంటూ కేడర్‌కు పిలుపు ఇవ్వడంలో ఆంతర్యం బోధపడటం లేదు మరి! 

పొత్తు వెనుక వ్యూహాలు ఉంటాయి. టీడీపీ వెనుక జన సేన వెళ్ళటం లేదు. టీడీపీతో కలిసి జన సేన నడుస్తోంది. నన్ను ఎమ్మెల్యేగానే గెలిపించలేదు. నాకు ఓటు వేసిన వారు ఈ ప్రశ్న అడిగితే గౌరవంగా ఉంటుంది. కానీ ఓటు వేయని వారు ఇప్పుడు నన్ను సీఎం చేస్తామంటున్నారు.!

  • ఇది తరచూ చేసే వ్యాఖ్యలే. గ్రౌండ్‌ లెవల్‌లో ఏం జరుగుతుందో తెలియంది కాదు.  ఏపీ ఓటర్లను.. జనసేన కార్యకర్తల్ని అవమానించేలా ‘సీఎం’ పదవి ప్రస్తావన చేస్తూ పవన్‌ చెప్పే మాటలు కొత్తేవీ కావు. 

పైగా అవివేకంతోనో.. అజ్ఞానంతోనో తాను ఈ నిర్ణయం తీసుకోలేదు 

  • అంటే.. జనసేనలో మిగతా వాళ్లంతా అవివేకులు, అజ్ఞానులు అనేనా? పవన్‌ ఉద్దేశం. రాజకీయాల్లో ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉన్న ఈరోజుల్లో.. పవన్‌ ఒక క్షేత్ర స్థాయి నేత కన్నా హీనంగా.. ఘోరంగా.. మరీ అధ్వాన్నంగా మాట్లాడడం గమనించదగ్గ విషయం కాదంటారా?
మరిన్ని వార్తలు