Cabinet meeting: మోదీ కీలక భేటీ,ఊహాగానాలు

30 Jun, 2021 11:39 IST|Sakshi

మంత్రి వర్గ విస్తరణ పై పలు  అంచనాలు

మంత్రిత్వ శాఖల పనితీరుపై సమీక్ష, మార్పులు చేర్పులు

కరోనా సెకండ్‌  వేవ్‌,  డ్రోన్‌ ఎటాక్‌పై తీవ్ర చర్చ 

సాక్షి,న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి, జమ్ములోని ఎయిర్ బేస్ డ్రోన్ దాడి నేపథ్యంలో  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం కేంద్ర మంత్రివర్గ కీలక భేటీ జరుగనుంది. ఈ సందర్భంగా దేశంలోని కోవిడ్-19 పరిస్థితులతోపాటు, డ్రోన్‌ ఎటాక్‌పై మంత్రులతో ప్రధాని మోదీ చర్చించ నున్నారు. వివిధ మంత్రిత్వ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించనున్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వర్చువల్‌గానే ఈ సమావేశం జరుగనుంది. దీంతోపాటు ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మంత్రి వర్గ సహచరులతో మరో కీలక సమావేశం కానున్నారు ప్రధాని. ముఖ్యంగా వచ్చే నెల (జూలై)లో ప్రారంభం  కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందే ప్రధాని తన మంత్రివర్గాన్ని విస్తరించాలని భావిస్తున్నారట. ప్రస్తుతం 60 మందిగా ఉన్న మంత్రుల సంఖ్యను 79 వరకు పెంచనున్నారనిఅంచనా. ఇటీవల కేంద్రమంత్రులతో తన అధికారిక నివాసంలో ప్రధాని వరుస భేటీలు మరింత బలాన్నిస్తున్నాయి. మంత్రివర్గంలో మార్పులు, చేర్పుల తోపాటు, మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న ఊహాగానాలు భారీగానే నెలకొన్నాయి. సాధారణంగా కేబినెట్ పునర్నిర్మాణం, లేదా విస్తరణకు ముందే ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తారు. 

చదవండి : Covid 19 థర్డ్‌ వేవ్‌ ప్రిపరేషన్‌: కేంద్రం కీలక నిర్ణయం
త్వరలో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు

మరిన్ని వార్తలు