చైనా అక్రమ వంతెన: మోదీ ప్రారంభిస్తారని భయంగా ఉంది!

19 Jan, 2022 18:44 IST|Sakshi

మోదీపై రాహుల్‌ గాంధీ వ్యంగ్యం

న్యూఢిల్లీ: చైనా అక్రమంగా వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలో వంతెన నిర్మిస్తుంటే ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా చూస్తున్నారంటూ కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. తూర్పు లద్దాఖ్‌ సరిహద్దుల్లో చైనా పట్టు కోసం పాంగాంగ్‌ సరస్సు మీదుగా అక్రమంగా ఒక వంతెనను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. బహశా ఆయన మౌనం కారణంగా చైనా ఉత్సాహంగా వంతెనను నిర్శిస్తోంది కాబోలు అని రాహుల్‌ గాంధీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

అయితే మోదీ ఈ వంతెనను ప్రారంభించేందుకు రారేమోనని భయం వేస్తుందంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.పాంగాంగ్‌ సరస్సు మీదుగా నిర్మిస్తున్న వంతెన గనుక పూర్తైయితే చైనీస్‌ దళాలు సరస్సు ఒడ్డుకు త్వరగా చేరుకోవడమే గాక మిలటరీ పరంగా పట్టు సాధించగలరని తెలిసి కూడా మోదీ ప్రభుత్వ ఏం పట్టనట్టు చూస్తుందని విమర్శించారు. పైగా మోదీ ప్రభుత్వం చైనాతో తూర్పు లద్దాఖ్ సరిహద్దులో ఉ‍న్న వివాదాన్ని పరిష్కరించడంలో విఫలమైందని, అందువల్లే భారత్‌- చైనా దళాల మధ్య ఘర్షణలు జరిగాయని అన్నారు.

అలాగే అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా భారత్‌కు చైనాతో సరిహద్దు వివాదం ఉందని.. పైగా అక్కడ కూడా భారత సైన్యం మోహరించని ప్రదేశాలను ఆక్రమించుకుని ఇలాంటి వంతెనలనే చైనా నిర్మించిందని అన్నారు. చైనా అక్రమ వంతెన నిర్మాణానికి సంబంధించిన వీడియోతోపాటు "మోదీ ఈ వంతెన ప్రారంభిస్తారేమో" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

(చదవండి: ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఏందయ్యా ఇది..)

మరిన్ని వార్తలు