రాజస్థాన్‌ ఎన్నికలు: ఫతేఫూర్‌లో రాళ్ల రాడి, భారీగా మోహరించిన పోలీసులు

25 Nov, 2023 15:53 IST|Sakshi

రాజస్థాన్‌  అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. అధికార కాంగ్రెస్‌, బీజేపీ మధ్య హారా హోరీగా  సాగుతున్న ఈ  పోరులో గెలుపుపై  ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజా మధ్యాహ్నం 1 గంటల వరకు 40శాతానికి పైగా ఓటింగ్ నమోదుగా  తాజా సమాచారం ప్రకారం 55.63శాతం ఓటింగ్ నమోదైంది. మరోవైపు సికార్‌లోని బోచివాల్ భవన్, ఫతేపూర్ షెఖావతి సమీపంలో  కొంతమంది  రాళ్ల దాడికి దిగారు.దీంతో వారిని చెదరగొట్టేందుకు భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 

రాష్ట్రంలో అన్ని చోట్లా ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతోంది. అయితే ఫతేపూర్ షెకావతి నుంచి హింసాత్మక సంఘటన చోటు చేసుకుంది.. రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ కారణంగా   ఉద్రిక్తత నెలకొంది. ఉద్రిక్తత సమయంలో జనం అదుపు తప్పి భారీగా రాళ్లు రువ్వారు. హింసాకాండతో కొంత సేపు ఓటింగ్ నిలిచిపోయింది. అయితే భద్రతా బలగాలు అప్రమత్తమై జనాన్ని అదుపు చేశారు. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత మళ్లీ ఓటింగ్ ప్రారంభమైంది.

 ఇది ఇలా ఉంటే ఈసారి  ట్రెండ్‌ రివర్స్‌ అవుతుందని, అధి​కారం తమదేనని ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ధీమా వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని వ్యాఖ్యానించారు. భాజపా అఖండ మెజారిటీతో అధికారంలోకి  రానుంది. రాజస్థాన్ ప్రజలు గత ఐదేళ్ల దుష్పరిపాలనకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఓట్లు వేస్తున్నట్లు కనిపిస్తోంది. నేరాలు, అవినీతి  పాలన అంతంకోసం  జనం ఓటు వేస్తున్నారుని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వ్యాఖ్యానిచారు. ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై   స్పందించిన బీజేపీ నేత, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే రాజకీయాల్లో ఉన్న వ్యక్తులెవరైనా ఇలాంటి వ్యాఖ్యలు  చేయడం సరైందికాదనీ కొత్త ఓటర్లు ఈ పరిణామాల్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు. 

 కాగా రాజస్థాన్‌లోని 200 నియోజకవర్గాల అసెంబ్లీలలో 199 అసెంబ్లీలలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది.     ఈ సాయంత్రం 6 గంటలక పోలింగ్‌కు కొనసాగుతుంది. డిసెంబర్‌ 3న ఓట్ల  లెక్కింపు ఉంటుంది.  పోలింగ్‌కు సంబంధించి గట్టి భద్రత ఏర్పాటు చేశామని  డీజీపీ పుమేష్‌మిశ్రా  తెలిపారు. ఇదిబ ప్రజాస్వామ్యానికి పండుగ  లాంటి, స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు డీజీపి పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు