Sajjala Ramakrishna Reddy: ‘రాజధాని పేరుతో చంద్రబాబు చేసిన అరాచకాలకు హద్దే లేదు’

1 Jul, 2022 13:04 IST|Sakshi

ఎన్టీఆర్‌ జిల్లా: రాజధాని పేరుతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన అరాచకాలకు హద్దే లేదని  వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు)సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. 2014-19 మధ్య చంద్రబాబు అన్యాయమైన విధానాలు అనుసరించారని, ఆ కాలంలో చంద్రబాబు సకల అరాచకాలు, నిరంకుశానికి, మాఫియాకు ఒక ఉదాహరణగా నిలిచిందని విమర్శించారు సజ్జల.

శుక్రవారం ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాల్లో సజ్జల మాట్లాడుతూ..‘తనకు పట్టం కట్టిన ప్రాంతాన్నీ నిర్లక్ష్యం చేశారు. గత చంద్రబాబు ప్రభుత్వం 46 ఆలయాలను కూల్చింది.  రోడ్ల విస్తరణ పేరుతో ఆలయాలను కూల్చేశారు. లక్ష కోట్లతో రాజధాని కడతాం అన్న చంద్రబాబు విజయవాడలో కనీసం ఒక ఫ్లై ఓవర్ కూడా కట్టలేక పోయారు’ అని విమర్శించారు.

మరిన్ని వార్తలు