బైజూస్‌తో ఒప్పందం పేద విద్యార్థులకు మేలు 

1 Jul, 2022 13:03 IST|Sakshi

నెల్లిమర్ల రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం బైజూస్‌తో చేసుకున్న ఒప్పందంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్ధులకు ఎంతో మేలు చేకూరుతుందని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. మండలంలో సతివాడ ఆదర్శ పాఠశాలలో గురువారం అమ్మఒడి వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడ్డుకొండ మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేసేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ఆర్థిక పరిస్థితి బాగున్న పిల్లలు మాత్రమే బైజూస్‌ విధానంలో చదవగలరని.. తాజా ప్రభుత్వ ఒప్పందంతో ప్రభుత్వ విద్యార్థులు ఉచితంగానే విద్యనభ్యసిస్తారన్నారు.

4 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఎమ్మెల్సీ డాక్టర్‌ పెనుమత్స సురేష్‌బాబు మాట్లాడుతూ, నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయన్నారు. అనంతరం రూ.10.76 కోట్ల నమూనా చెక్కును తల్లిదండ్రులకు అందజేశారు. పది, ఇంటర్‌లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడు, డీసీసీబీ వైస్‌ చైర్మెన్‌ చనమళ్లు వెంకటరమణ, వైస్‌ ఎంపీపీ పతివాడ సత్యనారాయణ, కార్పొరేషన్‌ డైరెక్టర్లు రేగాన శ్రీనివాసరావు, జానా ప్రసాద్, నౌపాడ శ్రీనివాసరావు, సర్పంచ్‌ రేవళ్ల శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యుడు రెడ్డి సత్యనారాయణ, నాయకులు జమ్ము అప్పలనాయుడు, లెంక గోవిందరావు, తహసీల్దార్‌ రమణరాజు, ఎంఈఓ కృష్ణారావు, ప్రిన్సిపాల్‌ పద్మలత పాల్గొన్నారు.  

(చదవండి: ఔను... ఆయనకు ఉద్యోగం వచ్చింది)

మరిన్ని వార్తలు