విమర్శలు చేసేందుకు చనిపోయిన నా భర్త పేరెందుకు: సుమలత

10 Jul, 2021 07:39 IST|Sakshi

సాక్షి, బెంగళూరు:  నటి, ఎంపీ సుమలత అంబరీష్, జేడీఎస్‌ నేత కుమారస్వామి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మాండ్య జిల్లాలో అక్రమ మైనింగ్‌ ద్వారా కుమార స్వామి, ఇతర జేడీఎస్‌ నేతలు లబ్ధి పొందారని ఆమె ఆరోపించారు. అక్రమ మైనింగ్‌ జరుగుతున్న ప్రాంతంలోకి తనను వెళ్లనివ్వలేదన్నారు. దీనిపై త్వరలో సీఎం యెడియూరప్ప, గనుల మంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తానన్నారు. తనపై విమర్శలు చేసేందుకు చనిపోయిన తన భర్త అంబరీష్‌ పేరును తరచూ ప్రస్తావించడంపై ఆమె మండిపడ్డారు.    

ఆయనకు వ్యక్తిత్వమే లేదు   
దొడ్డబళ్లాపురం: కుమారస్వామి ఏనాడో తన వ్యక్తిత్వాన్ని కోల్పోయారని, కొత్తగా సుమలతపై చేసిన వ్యాఖ్యల వల్ల పోగొట్టుకుంది కాదని ఎమ్మెల్సీ సీపీ యోగేశ్వర్‌ అన్నారు. శుక్రవారం రామనగర శివారులో  మీడియాతో మాట్లాడిన ఆయన కేఆర్‌ఎస్‌ డ్యామ్‌ పరిసరాల్లో ఎన్నో ఏళ్లుగా అక్రమ మైనింగ్‌ జరుగుతోందని, ఇదే విషయాన్ని సుమలత చెప్పి ఉంటారన్నారు. అయితే ఈ విషయంలో కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు సిగ్గుపడేలా ఉన్నాయన్నారు.  

మరిన్ని వార్తలు