చిరాగ్‌కు ఎదురుదెబ్బ: ఫైన్‌ వేయాలనుకున్నాం.. కానీ!

10 Jul, 2021 07:28 IST|Sakshi

న్యూఢిల్లీ:  తన బాబాయి పశుపతి పరాస్‌ను లోక్‌సభలో పార్టీ పక్షనేతగా గుర్తిస్తూ స్పీకర్‌ ఓంబిర్లా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ) నాయకుడు చిరాగ్‌ పాశ్వాన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. చిరాగ్‌ పిటిషన్‌పై జస్టిస్‌ రేఖా పిళ్లై శుక్రవారం విచారణ జరిపారు. ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదని చెప్పారు.

నిజానికి చిరాగ్‌ పాశ్వాన్‌కు జరిమానా విధించాలని భావించామని, ఆయన తరపు న్యాయవాది విజ్ఞప్తి మేరకు ఆ ఆలోచన విరమించుకున్నామని పేర్కొన్నారు. ఎల్‌జేపీ చీలిక వర్గం నాయకుడైన పశుపతి పరాస్‌ను లోక్‌సభలో ఆ పార్టీ పక్షనేతగా గుర్తిస్తూ స్పీకర్‌ జూన్‌ 14న సర్క్యులర్‌ జారీ చేశారు.    

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు