Telangana: మంత్రులకు శాఖల కేటాయింపు.. ఐటీ, ఆర్థిక మంత్రి ఎవరంటే?

9 Dec, 2023 09:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి, పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, మంత్రులకు నేడు శాఖలను కేటాయించారు. మంత్రుల శాఖలపై సీఎం రేవంత్‌ ఇప్పటికే అధిష్టానంతో చర్చలు జరిపారు. దీంతో, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనే అంశంపై క్లారిటీ తీసుకొని కేటాయింపు జరిగింది. కీలకమైన హోంశాఖ సీఎం రేవంత్‌ వద్దే ఉంది.

మంత్రులు, వారి శాఖలు ఇవే..
రేవంత్‌ రెడ్డి.. హోం శాఖ, మున్సిపాలిటీ, విద్య

మల్లు భట్టి విక్రమార్క: ఆర్థిక శాఖ, విద్యుత్‌

దామోదర రాజనర్సింహ: వైద్య, ఆరోగ్యశాఖ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి: సివిల్‌ సప్లై, నీటి పారుదల, 

సీతక్క: పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌, ఉమెన్‌ వెల్ఫర్‌

శ్రీధర్‌బాబు: ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు

కొండా సురేఖ: అటవీ శాఖ, దేవాదాయ, పర్యావరణ

పొంగులేటి శ్రీనివాస్‌: సమాచార శాఖ, రెవెన్యూ, హౌసింగ్‌

కోమటిరెడ్డి వెంకటరెడ్డి: ఆర్‌ అండ్‌ బీ, సినిమాటోగ్రఫీ

జూపల్లి: ఎక్సైజ్‌, పర్యాటక శాఖ, పురావస్తు

తుమ్మల నాగేశ్వరరావు: వ్యవసాయ శాఖ, చేనేత, అనుబంధ సంస్థలు

పొన్నం ప్రభాకర్‌: రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ
 

>
మరిన్ని వార్తలు