సారా, కూర, ఖారతో ఓటర్లను ప్రలోభ పెడుతున్న టీఆర్‌ఎస్‌

3 Oct, 2022 08:33 IST|Sakshi
వృ‍ద్ధుడిని మోసుకెళ్తున్న ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌

మర్రిగూడ: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార పార్టీ సారా, కూర, ఖార ఇచ్చి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. ఆదివారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని మర్రిగూడ, యరగండ్లపల్లి, తిరగండ్లపల్లి, లెంకలపల్లితోపాటు మరికొన్ని గ్రామాల్లో బహుజన రాజ్యాధికారయాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. 70 రోజులుగా 23 వేల మంది వీఆర్‌ఏలు శాంతియుతంగా సమ్మె చేస్తుంటే లాఠీచార్జి చేయించి అణచివేసే ప్రయత్నం చేస్తూ.. ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడడం అమానుషమన్నారు.  కాగా, మర్రిగూడ మండలంలోని పీహెచ్‌సీని ప్రవీణ్‌కుమార్‌ సందర్శించారు. అదే సమయంలో నడవలేక ఇబ్బంది పడుతున్న ఓ వృద్ధుని కుటుంబీకులు మోసుకెళ్తున్న దృశ్యం చూసి తాను కూడా చేయివేసి సాయం చేశారు.
చదవండి: బీజేపీకి కొత్త పేరు చెప్పిన కేటీఆర్‌

మరిన్ని వార్తలు